telangana cm announces excretia to victims of nalgonda bus accident

15 killed in lorry rtc bus collision in nalgonda

Telangana News, RTC Bus, Lorry Collision, Kills 10 passengers, Near Nalgonda', telangana cm kcr on nalgonda accident, cm announces excretia for bus accident victims, rtc excretia to victims, state government fund to victims, telangana cm kcr, mahender reddy, nayini narasimha reddy, jagadishwar reddy, nalgonda road accident

At least 15 persons were killed and several others injured when an RTC bus collided with a lorry near Indrapalanagaram of Ramannapeta in Nalgonda district

నల్గోండ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను అదుకుంటాం

Posted: 10/07/2015 09:51 PM IST
15 killed in lorry rtc bus collision in nalgonda

నల్గొండ జిల్లాలో బుధవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఉన్న సీఎంకు విషయం తెలియగానే వెంటనే స్పందించారు. తక్షణం ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీష్‌రెడ్డిని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు శాసనసభ తరఫున ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను తగిన విధంగా ఆదుకుంటామని కేసీఆర్‌ సభాముఖంగా ప్రకటించారు.

సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ చనిపోయినవారిలో చాలా మంది ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి ప్రయాణీకులు ఉన్నారని, వారికి ఆర్టీసీ తరఫున రూ. లక్ష పరిహారం ఇస్తుందని, ప్రభత్వ తరఫునుంచి కూడా బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, వాళ్ల స్థితిగతులను చూసి.. ఆ కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కేసీఆర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా సభ తరఫున కేసీఆర్‌ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

నల్లగొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందగా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం శివారులో చోటుచేసుకుంది. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. నార్కెట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఎదురుగా అతి వేగంతో వచ్చిన లారీ.. అర్టీసీ ప్రయాణికుల పాలిట మృత్యు శకటంలా మారింది. వేగంగా దూసుకువచ్చిన లారీ బస్సును ఢీకొనడంతో పదిహేను మంది ప్రాణాలను కబళించింది. అనేక మందిని క్షతగాత్రులను చేసింది. ఒక మలుపు వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ వైపు కూర్చున్న వాళ్లంతా మరణించారు. దాదాపు వారం రోజుల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. నల్లగొండ జిల్లాల్లో మలుపుల వద్ద ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 25 మంది ప్రయాణికులతో వెళుతున్న AP29 Z 2270 నెంబర్ బస్సు నల్లగొండ నుంచి భువనగిరి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana News  RTC Bus  Lorry Collision  Kills 10 passengers  Near Nalgonda'  

Other Articles