Telangana Govt will regularise the contract employees

Regularise the contract employees

Telangana, Eetala Rajender, Contract Employees, Regularisation

Telangana finance minister Eetela Rajender said that govt will regularise the contract employees. Govt gave assurance to contract employees for their regularisation.

కాంట్రాక్ట్ ఉద్యోగుల పర్మినెంట్ పక్కా

Posted: 10/06/2015 03:05 PM IST
Regularise the contract employees

తెలంగాణ ఉద్యమ సమయంలో నేటి అధికారంలో ఉన్న నాయకులు కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు దిశగా అందరూ కూడా ఉద్యమానికి మద్దతు పలకాలని కోరారు. అయితే ఉద్యమం ముగిసింది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడం.. అప్పుడే ఏడాదిన్నర కూడా గడిచింది. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద మాత్రం ప్రభుత్వం ఊసెత్తడం లేదు.  ఎప్పుడుప్పుడా అని ఎదురుచూస్తున్న రెగ్యులరైజేషన్ మీద కేసీఆర్ మాత్రం దాటవేత వైఖరిని అవలంబిస్తున్నారు. అయితే తాజాగా ఓ మంత్రి మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందిస్తున్నారు. తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది అని అంటున్నారు.

తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద స్పందించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను త్వరలోనే పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 25589 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. అయితే ఔట్ సోర్సింగ్ ద్వారా వచ్చిన ఉద్యోగుల విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదని అన్నారు. ఉద్యమ సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తొందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని గుర్తు చేశారు. మొత్తానికి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తాజా ప్రకటన కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఆశలు చిగురింపజేసింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Eetala Rajender  Contract Employees  Regularisation  

Other Articles