ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఓ సింహం ఇప్పుడు పరుగులు తీస్తోంది.. పరుగులు తియ్యడం కాదు ఏకంగా గర్జిస్తోంది. అవును బారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేంద్రమోదీ తెచ్చిన మేకిన్ ఇన్ ఇండియా అనే సింహం ఇప్పుడు దేశ విదేశాల్లో గర్జిస్తోంది. భారత శక్తిని చాటుతోందని మోదీ వెల్లడించారు. జర్మనీ ఛాన్స్ లర్ ఏంజిలా మార్కెల్ తో కలిసి మేకిన్ ఇన్ ఇండియా మీద ఓ అవగాహన నిర్వహించారు మోదీ. మేకిన్ ఇండియా'లో భాగంగా భారత్ చేపట్టిన సంస్కరణలు ఫలితాలను అందిస్తున్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. మాన్యుఫాక్చరింగ్, ఐటీ రంగాల్లో నూతన ఆవిష్కరణలను గురించి అక్కడి ఉన్నతోద్యోగులను అడిగి తెలుసుకున్న ఆయన, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, ఎన్టీయే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వివరించారు. పన్ను విధానాలను పూర్తి పారదర్శకంగా మార్చామని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను వసూలు అమలు చేసే లక్ష్యంగా జీఎస్టీ బిల్లును తీసుకురానున్నామని తెలియజేశారు.
వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ వంటి సంస్థలు ఇండియాలో వృద్ధి రేటు మరింత వేగవంతమవుతుందని అంచనా వేశాయని మోదీ తెలిపారు. భారత జీడీపీ వృద్ధి రేటు సైతం ఏడు శాతానికి పైగా ఉందని, ఎఫ్డీఐ సైతం గత సంవత్సరంతో పోలిస్తే 14 శాతం పెరిగిందని గుర్తు చేశారు. పరిశ్రమలు స్థాపించేందుకు వస్తున్న వారికి వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని, రక్షణ రంగంలో 49 శాతం విదేశీ పెట్టుబడులకు ఆమోదం పలికామని మోదీ అన్నారు. రైల్వేల్లో వందశాతం ఎఫ్డీఐకి స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలతో కలసి ప్రభుత్వం పలు ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తి చేసిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను ఇదే విధానంలో చేపడతామని అన్నారు. ఇండియాలో యువత సంఖ్య అధికంగా ఉందని, వీరిలో నైపుణ్యానికి కొదవలేదని నరేంద్ర మోదీ అన్నారు. వీరిని ఎంటర్ ప్రెన్యూర్లుగా మార్చి వారికి అవసరమయ్యే పెట్టుబడులను అందించడం ద్వారా తదుపరి తరం వృద్ధి దిశగా ఇండియా అడుగేయనుందని వివరించారు. దేశాభివృద్ధిలో జర్మనీ పెట్టుబడిదారులు భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపిన ఆయన, భారత్ అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more