Black money: Govt collects Rs 3770 cr from 638 people

3770 crore surfaces in government s black money drive

black money, fema, central board of direct taxes, cbdt, income-tax act, wealth tax act, fema, companies act and customs act, Tax, Finance Ministry, CBDT, black money compliance window, Black Money

638 number of declarations have been received under the compliance window declaring undisclosed foreign assets amounting to Rs 3770 crore

638 నల్లధన కుబేరుల వద్ద.. రూ. 3770 కోట్ల బ్లాక్ మనీ..!

Posted: 10/01/2015 03:16 PM IST
3770 crore surfaces in government s black money drive

భారతీయ రిజర్వు బ్యాంకు కల్పించిన అవకాశాన్ని వినియోగించుకున్న 638 మంది తమ దగ్గర నల్లధనం ఉందని వెల్లడించారు. 638 మంది తమ వద్దు సుమారుగా 3,770 కోట్ల రూపాయల నల్లధనం ఉన్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చైర్మన్ అనితా కపూర్ ఇవాళ ఒక  ప్రకటనలో తెలిపారు. ఈ-ఫైలింగ్ పోర్టల్ ను బుధవారం అర్ధరాత్రి తర్వాత కూడా తెరచివుంచినట్టు సీబీడీటీ చైర్ పర్సన్ అనితా కపూర్ తెలిపారు. నిన్నటితో ముగిసిన ఈ సింగిల్ విండో విధానానికి మంచి స్పందిన వచ్చిందని తెలిపారు.

ఇప్పటివరకు వివరాలు వెల్లడించిన వారు పన్నులు, బకాయిలు చెల్లించేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉందని వెల్లడించారు. నల్లధనం వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం 90 రోజుల గడువు ఇచ్చింది. ఈ విధానం కింద తమ వద్దనున్న నల్లధనం వెల్లడించిన వారికి ఫెమా కింద చర్యలు తీసుకోబోమని భారతీయ రిజర్వు భ్యాంకు ప్రకటించిన నేపథ్యంలో 638 మంది ముందుకు వచ్చి వారి నల్లధన వివరాలను వెల్లడించారు. బయటికి వెల్లడించని విదేశీ ఆస్తులు కలిగిఉన్న వ్యక్తులెవరైనా వాటి వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక సదుపాయాన్ని(వన్‌టైమ్ కాంప్లియన్స్ విండో) కల్పించింది.

 గడుపులోపు వెల్లడించిన మొత్తం ఆస్తుల విలువలో 60 శాతాన్ని పన్ను, జరిమానా రూపంలో చెల్లిస్తే సరిపోతుంది. ఈ చెల్లింపులకు డిసెంబర్ 31 వరకూ గడువు ఉంటుంది. కాంప్లియన్స్ విండో గడువు ముగింపు తేదీ తర్వాత వివరాలను వెల్లడించినట్లయితే మొత్తం విలువలో 120 శాతాన్ని పన్ను, జరిమానాల రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సివుంటుంది. దీంతో నల్లధన కుబేరులు స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారి బ్లాక్ మనీ వివరాలను తెలియజేసేందుకు ముందుకు వచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tax  Finance Ministry  CBDT  black money compliance window  Black Money  

Other Articles