Farmer Suicides Rock Telangana Monsoon Session

Farmer suicides rock telangana assembly

The spate of suicides by farmers in Telangana rocked both houses of the state legislature on Tuesday.

The spate of suicides by farmers in Telangana rocked both houses of the state legislature on Tuesday.

అసెంబ్లీ సాక్షిగా.. ఇంగ్లీషు, తెలుగు, హిందీ బాషల్లో సాగిన మాటల యుద్దం

Posted: 09/29/2015 06:43 PM IST
Farmer suicides rock telangana assembly

అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్, ఎంఐఎం శాసనభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీకీ మధ్య మాటల యుద్దం సాగింది. రైతుల ఆత్మహత్యలపై సాగిన చర్చలో భాగంగా.. ఓవైసీ మాట్లాడుతూ.. మంత్రుల నియోజకవర్గాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని ఒవైసీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రైతులంతా కూడా సీఎం కేసీఆర్లాగే కళకళలాడాలని, అందరూ ఆయన ఫాంహౌస్లో సంపాదించినంత సంపాదించాలని, ఆయనలాగే టోపీలు పెట్టుకుని అందంగా కనిపించాలని ఆయన అన్నారు.

మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటనలో జిల్లాల వారీగా వర్షపాతాల వివరాలు చెప్పారు. కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షపాతం పడిందన్నారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉందని చెప్పారు. పంట పరిస్థితి కూడా సంతృప్తి కరంగా ఉందన్నారు. అయితే అక్కడ రైతుల ఆత్మహత్యలు జరగకూడదు కానీ ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. నేరమంతా వానదేవుడి మీదే నెట్టేసి.. ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్ గా అలోచిస్తుందని చెప్పండం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

వ్యవసాయశాఖలో కొంతమంది అధికారులు డిప్యూటేషన్ మీద హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నారు. వాళ్లకు అసలు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు..? వాళ్లు జిల్లాలకు వెళ్లి అక్కడ రైతుల కోసం పనిచేయాలి.. దానికోసం మంత్రులు గట్టిగా ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా మంచి రైతులా కనిపిస్తుంటారు. ముఖ్యమంత్రి తన ఫాంహౌస్లో ఏం చేస్తున్నారు.. అక్కడ అంతా పచ్చగా కనిపిస్తుంటే మిగిలిన పొలాలు ఎందుకు బీడువారిపోతున్నాయి?
అక్కడ కురుస్తున్న వర్షం.. మిగిలిన చోట్ల ఎందుకు కురవడంలేదని ప్రశ్నించారు.

తాను రైతును కానని, హైదరాబాద్లో పుట్టి పెరిగాను కానీ, రైతుల గురించి ఆలోచిస్తాను, బాధపడతానన్నారు. ప్రతిసారీ మనం రైతుల సమస్యల మీద చర్చిస్తాం, ప్లకార్డులు చూపిస్తాం, పని అయిపోయిందని అనుకుంటాం. అసలు ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకుంటుంది? మనం రైతుల దీన గాధలను వినాలని అనుకోవడం లేదని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో ఒకలా ఉంటే, అసెంబ్లీలో మంత్రి చేసిన ప్రకటన వేరేలా ఉందని అన్నారు.
    
ప్రైవేటు వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునే రైతులు 67.3 శాతం మంది ఉన్నారు.. ఇది దేశంలోనే అత్యధికమని ఒవైసీ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 వేల మంది రైతులకు మాత్రమే కిసాన్ కార్డులు ఇచ్చారని. కనీసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా కిసాన్ కార్డులు ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వానికి లేదా?  అలా ఇవ్వకపోవడం వల్లే వాళ్లు ప్రైవేటు వ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు తీసుకోవాల్సి వస్తోందన్నారు. కరువు ప్రకటించడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? అని ప్రశ్నించారు. గడిచిన 15 నెలల కాలంలో 1400 మంది రైతులు, అంటే ప్రతి రోజూ ఒక రైతు చనిపోతున్నాడని అన్నారు. రేపటి నుంచి ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోడని ఈ ప్రభుత్వం సభకు హామీ ఇవ్వగలదా? అని నిలదీశారు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది మాత్రమేనన్నారు. దాంతో రైతులకు ప్రయోజనం కలిగింది... కానీ ఇప్పుడు మాత్రం విడతలుగా చేస్తున్నారని అన్నారు.

ఈ సమయంలో కేటీఆర్ కల్పించుకుని ఒవైసీకి సమాధానం ఇచ్చారు ఒవైసీ.. ఆయన మాత్రమే మాట్లాడాలని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం సీరియస్ గా లేదని, కొందరు నవ్వుతున్నారని అని విమర్శించడమేంటని ఆయన ప్రశ్నించారు. తామంతా కూడా రైతుల సమస్యల మీద సీరియస్ గానే ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఒకేసారి రుణమాఫీ చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామని అన్నామన్నారు. ఏమైనా చెప్పాలనుకుంటే నేరుగా చెప్పండి అంతేతప్ప ఇతరుల మీద కామెంట్లు చేయడం సరికాదు. ఇతర శాసన సభ్యులకు ఉన్నట్లుగానే అవే హక్కులు మీకు ఉంటాయి. మీకు ప్రత్యేక హక్కులు కావాలనుకుంటే కుదరదని అన్నారు. మీరు గౌరవం ఇస్తే మీకూ గౌరవం దక్కుతుంది.. బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తే స్పందించమని చెప్పారు.

దాంతో మళ్లీ అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడారు. ఇతర సభ్యులు మాట్లాడేటప్పుడు మంత్రులెవరూ జోక్యం చేసుకోలేదు గానీ, తాను మాట్లాడుతుంటే గౌరవ మంత్రి కల్పించుకున్నారని అన్నారు. నేరుగా మాట్లాడాలని అంటున్నారు.. అంటే తాను వంకరగా మాట్లాడుతున్నానా? మంత్రి ఇలా అనడానికి వీల్లేదు. తాను ఏం వంకరగా మాట్లాడుతున్నానో చెప్పండని ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ మరోమారు ప్రతిస్పందించారు. ప్రభుత్వం కూడా సీరియస్ గానే ఉందని చెబుతున్నామన్నారు.  ఈ రకమైన మాటలు మాట్లాడినప్పుడు నేరుగా సబ్జెక్టులోకి రావాలని అని సూచించామన్నారు. ఎవరో నవ్వుతున్నారని, సభాపాక్షిగా విమర్శలు చేయడం సబబు కాదని, అలాంటి వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత తమపై వుందన్నారు. ఇతర పార్టీల సభ్యులు ఏం మాట్లాడినా మావాళ్లు ఎవరూ కలగజేసుకోవాల్సిన అవసరం రాలేదన్నారు. ఇప్పుడు మాత్రమే తాను జోక్యం చేసుకునేందుకు అక్బరుద్దిన్ ప్రసంగించిన మాటలను బట్టి వచ్చిందన్నారు. వీరిద్దరి మధ్య మరోమారు మాటల యుద్దం చోటుచేసుకోకుండా మంత్రి హారీష్ రావు, ఆ తరువాత సీనియర్ పార్లమెంటేరియన్ జానారెడ్డిలు సభను సక్రమంగా సాగేలా చూశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  kcr  akbaruddin owaisi  minister ktr  minister Harish Rao  farmers suicides  

Other Articles