Congress Party Uploaded The Photo Of Rahul Gandhi Visited At Aspen Conference | Indian National Congress

Congress party twitter upload rahul gandhi aspen conference

rahul gandhi news, rahul gandhi secret tour, rahul gandhi aspen conference, rahul gandhi controversies, rahul gandhi latest news, rahul gandhi assets, aspen conference, indian national congress, congress twitter

Congress Party Twitter Upload Rahul Gandhi Aspen Conference : Congress Party Uploaded The Photo Of Rahul Gandhi Visited At Aspen Conference Along With The Statement Of Very interesting discussions on the global economy &the disruptive power of tech at the conference in Aspen.

రాహుల్ అదృశ్య పర్యటనపై లబోదిబోమంటున్న కాంగ్రెస్

Posted: 09/28/2015 03:01 PM IST
Congress party twitter upload rahul gandhi aspen conference

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి అదృశ్య పర్యటనకు పయనమైన విషయం తెలిసిందే! గతంలో అత్యంత కీలకమైన బీజేపీ బడ్జెట్ సమావేశాల సమయంలో కంటికి కనిపించకుండా పోయిన ఆయన... ఇప్పుడు బీహార్ లో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్న క్రమంలో మాయమయ్యారు. రాహుల్ ఇలా సడెన్ గా అదృశ్యం అవడంపై ఆ పార్టీ నేతలకే అవగాహన లేకపోయింది. అయితే.. ఈసారి సైలెంట్ గా వుంటే మునుపటిలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావించిన కాంగ్రెస్.. ఓ సందర్భంలో రాహుల్ లండన్ కు వెళ్లారని ప్రకటించింది. ఆ తర్వాత ఆ పార్టీ అధికార ప్రతినిధి సూర్జేవాలా ఆయన అమెరికా వెళ్లారని, అక్కడ అస్పెన్ సదస్సులో పాల్గొనడానికే వెళ్లినట్లు వివరించారు. కానీ.. క్లారిటీ లేకపోయింది.

అయితే అమెరికా నగరం ఆస్పెన్ లో ఎప్పుడో ముగిసిన అంతర్జాతీయ సదస్సుకు రాహుల్ గాంధీ ఇప్పుడు వెళ్లడమేమిటని బీజేపీ ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై నిన్నటిదాకా నోరు మెదపని కాంగ్రెస్.. ఇప్పుడు ఓ ఫోటోతో తెరమీదకొచ్చింది. రాహుల్ గాంధీ నిజంగానే ఆస్పెన్ సదస్సులో పాల్గొన్నారంటూ ఓ ఫోటో అప్ లోడ్ చేసి మరి కాంగ్రెస్ పార్టీ ట్విటర్ లో పోస్ట్ చేసింది. తాము అప్ లోడ్ చేసిన ఫోటో ఆయన ఆస్పెన్ సదస్సులో పాల్గొన్నదేనని ఆ పార్టీ నేతలు డప్పు వాయించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఫొటోలో.. సదస్సులో కూర్చున్న రాహుల్ ఫొటో అయితే ఉంది కాని, ఆ సదస్సు ఎప్పుడు, ఎక్కడ జరిగిందోనన్న వివరాలు మాత్రం లేవు. అంటే.. ఈసారి రాహుల్ వెళ్లిన పర్యటనకు సంబంధించి కచ్చితమైన ఆనవాళ్లు కాంగ్రెస్ పార్టీ దగ్గర లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి.. రాహుల్ ఎక్కడికి వెళ్లినట్లు?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  aspen conference  indian national congress  

Other Articles