Pakistan Media Wrote Interesting Stories On Narendra Modi America Tour And Neglect Nawaz Sharif | Modi America Tour

Pakistan media interesting stories on narendra modi america tour

pakistan media, narendra modi news, narendra modi america tour, pak media on modi tour, pak media modi news, pakistan news, pakistan wrote modi news, modi controversies

Pakistan Media Interesting Stories On Narendra Modi America Tour : Pakistan Media Wrote Interesting Stories On Narendra Modi America Tour And Neglect Nawaz Sharif.

మోదీ అమెరికా పర్యటనపై ‘పాక్’ ఆసక్తికర కథనాలు

Posted: 09/28/2015 01:50 PM IST
Pakistan media interesting stories on narendra modi america tour

దాయాది దేశమైన పాకిస్థాన్ నిత్యం ఇండియా మీద నిప్పులు చెరుగుతుంటుంది. ముఖ్యంగా అక్కడి మీడియా ఇండియాపై అక్కసు వెళ్లగక్కే సమయం ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేచి చూస్తుంటుంది. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా పాక్ పత్రికలు ఆసక్తికరమైన కథనాలు ప్రచురించాయి. తమ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ కంటే మోదీని పొగడ్తలతో ముంచెత్తుతూ ఆ పత్రికలు ప్రస్తావించడం విశేషంగా మారింది.

ప్రస్తుతం ప్రధాని మోదీతోపాటు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంకా ఇతర దేశాల అధినేతలు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే! దీంతో ప్రపంచం మీడియా మొత్తం ఆ వార్తలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. అయితే.. ఆ సమావేశాల్లో అగ్రరాజ్యాల అధినేతలు వున్నప్పటికీ.. ప్రధాని మోదీకి సంబంధించిన వార్తలకే మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఉదాహరణగా పాకిస్థాన్ పత్రికలు ప్రచురించిన కథనాలనే తీసుకోవచ్చు. తమ దేశ ప్రధాని నవాజ్ కూడా అమెరికాలో పర్యటనలో వున్నప్పటికీ.. ఆయన గురించి కాకుండా మోదీపై ఆసక్తికర కథనాలను ప్రచురించాయి.

అమెరికాలో మోదీకి సినిమా స్టార్ తరహాలో ఘనస్వాగతం లభించిందని పాక్ పత్రికలు కీర్తించాయి. అలాగే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ తదితర కార్యాలయాలకు వెళ్లిన మోదీకి ఆయా ప్రాంతాల్లో రెడ్ కార్పెట్ స్వాగతం లభించిందని ఆ పత్రికలు పేర్కొన్నాయి. ఇక ఫేస్ బుక్ చీఫ్ జుకెర్ బర్గ్ తరహా వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు మోదీ సావధానంగా సమాధానాలిచ్చారని అవి ప్రస్తావించాయి. అయితే.. తమ ప్రధాని షరీఫ్ మాత్రం ఐరాస జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాన్ని మాత్రమే పాకిస్థాన్ మీడియా రిపోర్ట్ చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan media  narendra modi america tour  

Other Articles