ISRO launches dedicated astronomy satellite Astrosat | Isro Latest Updates

Isro launches dedicated astronomy satellite astrosat along with six other co passengers

isro latest news, astrosat satellite, astrosat isro launch, pslv c30, pslv c30 astrosat, isro latest updates

ISRO launches dedicated astronomy satellite Astrosat along with six other co-passengers : Astrosat, India's first dedicated space observatory, was launched on Monday at 10 am from the spaceport of Sriharikota in Andhra Pradesh.

‘ఇస్రో’ ఘనతకు జై కొట్టిన అగ్రదేశాలు

Posted: 09/28/2015 11:53 AM IST
Isro launches dedicated astronomy satellite astrosat along with six other co passengers

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఎటువంటి లోట్లు లేకుండా విదేశీ శాటిలైట్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఈ సంస్థ.. తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. ఈ సంస్థ తాజాగా రూపొందించిన ‘అస్ట్రోశాట్’ ఉపగ్రహాన్ని సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి పొలార్ శాటిలైట్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ)-సీ30 ద్వారా ఆ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో విజయం సాధించింది. మొట్టమొదటిసారిగా ఖగోళ పరిశోధన కోసం చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పీఎల్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహన నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన అస్ట్రోశాట్ ను అంతరిక్ష్యంలోకి పంపించారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రిక్రియ.. నిర్వఘ్నంగా కొనసాగి సోమవారం ఉదయం 10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేసిన ఈ తొలి ప్రయోగంలో భాగంగా.. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి ప్రయోగించారు. అంతేకాదు.. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది.

పీఎల్ఎల్వీ సీ30 రాకెట్ ద్వారా ‘అస్ట్రోశాట్‌’తో పాటు ఇండోనేషియా లాపాన్‌-2(68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌యా(5.5) యూఎస్‌కు సంబంధించిన లెమర్‌-2, 3, 4,5(16కిలోలు) ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని వీక్షించారు. ఇంకో విశేషం ఏమిటంటే.. పీఎల్ఎల్వీ 30 ద్వారా పంపిన ఆరు విదేశీ ఉపగ్రహాలతో భారత్ ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50ని దాటింది. అలాగే.. అగ్రరాజ్యమైన అమెరికా ఉపగ్రహాలను కూడా నింగిలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రోది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isro latest news  astrosat satellite  pslv c30 astrosat  

Other Articles