Actress Kangana Ranaut Says She Don't Like Live-In-Relationship | Live-In-Relationship | Bollywood Updates

Kangana ranaut comments on live in relationship bollywood updates

kangana ranaut news, kangana ranaut updates, kangana ranaut affairs, kangana ranaut live in relationship, kangana ranaut controversies, bollywood relations, bollywood actresses, kangana affairs

Kangana Ranaut Comments On Live-In-Relationship Bollywood Updates : Actress Kangana Ranaut Says She Don't Like Live-In-Relationship.

‘సహజీవనం’పై పెదవి విప్పిన నటి కంగానా రనౌత్

Posted: 09/28/2015 12:26 PM IST
Kangana ranaut comments on live in relationship bollywood updates

పాశ్చాత్త దేశాల సంప్రదాయాలు భారతదేశంలోనూ విస్త్రతంగా అమలులోకి వచ్చేశాయి. అర్ధనగ్న దుస్తులు ధరించడం నుంచి సహజీవనం చేసే వరకు వ్యవహారం వచ్చేసింది. అయితే.. ఈ విధమైన సంప్రదాయాలు ఎక్కువగా చిత్రపరిశ్రమలోనే కనిపిస్తాయి. నటీనటులందరూ తమకు నచ్చనవారితో ఏళ్లతరబడి సహజీవనం చేస్తున్న ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. అలాంటి జాబితాలో కంగనా రనౌత్ కూడా వుందంటూ ఇదివరకే పుకార్లు షికార్లు చేశాయి. అలాంటి వార్తలపై ఆమె నోరు మెదపకపోవడంతో.. ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు.. ఆమెకు కేవలం ఒక్కరితోనే కాకుండా ఇండస్ట్రీలో చాలామందితో ఎఫైర్లు వున్నట్లు ప్రచారాలు ఇప్పటికీ జోరుగా సాగుతున్నాయి. ఇన్నాళ్లూ ఈ వార్తలపై సైలెంట్ గా వున్న ఆమె.. తాజాగా పెదవి విప్పింది. తాను ఎవరినీ ప్రేమించలేదని, సహజీవనం ఎన్నటికీ చేయనని పేర్కొంది.

‘‘ఎవరైతే తమ జీవితంపట్ల అసంతృప్తిగా ఉన్నారో వాళ్లే సహజీవనం చేస్తారు. అలాగే, ఎవరికైతే అభద్రతాభావం ఉంటుందో వాళ్లు తోడు కోసం సహజీవనం చేస్తారు. నా జీవితం మీద నాకెలాంటి అభద్రతాభావం లేదు. ఎలాంటి అసంతృప్తీ లేదు. పైగా.. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ అనేది ఎప్పుడూ తెరిచి ఉంచిన తలుపులాంటిది. నచ్చినప్పుడు ఆ ఇంట్లోంచి వెళ్లిపోవచ్చు. అలా తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అనుబంధాలు నాకెందుకు? నా మనసుకి నచ్చిన అబ్బాయి తారసపడితే పెళ్లి చేసుకుంటా. నేను ఎవరితోనూ సహజీవనం చేయలేదు.. చేయను కూడా!’ అని ఆమె తేల్చి చెప్పేసింది. అయితే.. మూడుపదుల వయస్సు దాటిన ఈ అమ్మడు ఎప్పుడు, ఎవరితో పెళ్లి చేసుకుంటారోనన్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. చిరునవ్వు ఇచ్చుకుని సైడైపోయింది. ఇంతవరకు బాగానే వుంది కానీ.. గతంలో కొందరు బాలీవుడ్ నటులతో ఈమె నడిపిన ప్రేమ వ్యవహారాలు నిజమా? కాదా? అని మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kangana ranaut affairs  bollywood updates  live in relationship controversy  

Other Articles