Police reject to Jagans strike in Guntur

Police reject to jagans strike in guntur

Jagan, Special Status, Guntur, Strike, Protest, JaganMohanReddy

Police reject to Jagans strike in Guntur. But JaganMohan reddy palning to do strike at anycost. On special status to the state of ap demand, Jagan likely to strike in Guntur.

జగన్ దీక్ష పై ప్రత్యేక టెన్షన్

Posted: 09/25/2015 08:13 AM IST
Police reject to jagans strike in guntur

రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈ నెల 26వ తేదీన గుంటూరు లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తలపెట్టిన దీక్షను భగ్నం చేసేందుకు ఇటు పోలీ సులు.. దీక్ష చేపట్టేందుకు అటు వైసీపీ నేతలు ఉద్యు క్తులవ్వడంతో అంతటా ఉత్కంఠత నెలకొంది.. దీక్షలు, ఆందోళనల వల్ల పార్టీకి మైలేజీ రావడం లేదంటూ పార్టీలోనే కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లుగా దీక్షల వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగలేదనే వాదనలు పార్టీ లో వినవస్తున్నాయి.. ఇటీవల విజయవాడలో భూ సేకరణకు వ్యతిరేకంగా జగన్‌ నిర్వ హించిన దీక్ష విఫలమైందనే విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్‌ ప్రత్యేక హోదా కోసం గుంటూ రులో దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. గుంటూరు ఉల్ఫ్‌ హాలు గ్రౌండ్స్‌లో దీక్షకు గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదిక కూడా సిద్ధమవుతోంది.. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మూడు కారణాలను సాకుగా చూపి అనుమతిని నిరాకరించింది.

ఏది ఏమైనా దీక్షకు కోర్టు నుంచి అయినా అనుమతి సాధించాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. అయితే కోర్టు కనుక వీల్లేదని ఆదేశాలిస్తే వెనుకడుగు వేయాల్సి వస్తుందని..న్యాయనిపుణుల సూచనలు తీసుకున్న అనంతరం తుది నిర్ణయం తీసుకుని దీక్ష చేపట్టాలని జగన్‌ భావిస్తున్నట్లు సమాచారం. దీక్షకు అనుమతినిచ్చే విషయంలో వైసీపీ నేతల నోటిదురుసు తనమే కారణంగా పోలీసులు చెప్తున్నారు. ఇటీవల విజయవాడలో జగన్‌ దీక్ష సందర్భంగా ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌తో పాటు ఇతర నేతలు చేసిన దూకుడు ప్రసంగాలను ప్రభుత్వం సాకుగా చూపుతోంది. గత నెలలో వైసీపీ నిర్వహించిన బంద్‌ సందర్భంగా బస్సులను ధ్వంసంచేయాలని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ బహిరంగ వేదికపై కార్యకర్తలను రెచ్చకొట్టే ప్రసంగాలు చేశారు. అంతేకాదు పోలీసుల కేసులు మనకు కొత్తకాదు.. మూడుసార్లు పెట్టి కొట్టేస్తారు.. దానికి భయపడొద్దని కూడా స్పష్టంచేశారు. దీనిపై అప్పట్లోనే నగర పోలీసు కమిషనర్‌ స్పందించారు. ప్రస్తుతం అదే తరహాలో విధ్వంసానికి పాల్పడతారనే ముందు జాగ్రత్త చర్యతో దీక్షకు అనుమతివ్వటంలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Special Status  Guntur  Strike  Protest  JaganMohanReddy  

Other Articles