Uninor re-brands itself as Telenor in India

Uninor re brands itself as telenor in india

Uninor, Telenor, India, Telecom, Services, Uninor network

Uninor re-brands itself as Telenor in India. Telecom service provider Uninor announced it has rebranded itself as Telenor in India. “Uninor is now Telenor. This rebranding exercise shows our commitment to the customers and the stakeholders in this country. India is a tough market. We are taking a stand that we will continue to develop ourselves,” said Telenor Group’s head of Asia region Morten Karlsen Sorby.

యునినార్ కాదు టెలినార్

Posted: 09/24/2015 11:07 AM IST
Uninor re brands itself as telenor in india

నార్వే బేస్డ్ ఇండియన్ టెలికాం మొబైల్ ఆపరేటర్, యూనినార్, నిన్న పేరు మార్చుకుంది. ఇక నుండి దీని కొత్త పేరు, టెలీనార్ (Telenor) పేరుతో పాటు క్రింద టాగ్ లైన్ కూడా మారుస్తున్నట్లు కంపెని ఆసియా రీజియన్ టెలినార్ గ్రూప్ హెడ్, మార్టెన్ సార్బీ అన్నారు. గతంలో కాల్ డ్రాప్స్ విషయంలో రిఅంబర్స్ మెంట్ కేవలం లోకల్ కాల్స్ కు ఇచ్చింది కంపెని, ఇప్పుడు ఎస్టీడీ, ఐఎస్డీ కాల్స్ మాట్లాడినప్పుడు కూడా, కాల్ డ్రాప్స్ అయితే మీ కాల్ చార్జెస్ వెన్నక్కి వస్తాయి. యునిటెక్ వైర్లెస్ అనే జాయింట్ వెంచర్ తో కలిసి యునినార్ (uninor) గా ఇండియాలో బిజినెస్ మొదలపెట్టింది నార్వే బేస్డ్ కంపెని . గత సంవత్సరం యునిటెక్ పూర్తిగా బిజినెస్ నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి టెలినార్ నార్వే కంపెని దీనిని లాభాల బాటలో నడిపించింది. కాబట్టి టెలినార్  గ్రూప్ ఆపరేట్ చేస్తున్నయూనినర్ ఇప్పటివరకూ ఆంధ్రా, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర అండ్ ఉత్తర ప్రదేశ్ లలో సర్వీసెస్ నడిపింది. ఇక మీదట కూడా నడపనుంది కాని యూనినార్ పేరు మీద కాదు, Telenor పేరు మీద.

రీబ్రాండింగ్‌లో భాగంగా 80-100 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ఇదిలావుంటే కాల్‌డ్రాప్ రిఫండ్ ఆఫర్లను విస్తరిస్తున్నట్లు ఈ సందర్భంగా టెలినార్ స్పష్టం చేసింది. లోకల్, ఎస్‌టిడి, ఐఎస్‌డి కాల్స్ అన్నింటికీ కాల్‌డ్రాప్ రీయింబర్స్‌మెంట్ సౌకర్యాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. కాల్‌డ్రాప్స్‌పై వినియోగదారులకు నష్టపరిహారం అందించనున్నట్లు ప్రకటించింది. ఇక దేశంలో అత్యంత చౌక టెలికాం సేవల సంస్థ టెలినారేనని ఈ సందర్భంగా కార్ల్‌సన్ అన్నారు. సంస్థ ట్యాగ్ లైన్‌ను కూడా ‘సబ్సే సాస్తా’ నుంచి ‘అబి లైఫ్ ఫుల్ పైసా వసూల్’గా మార్చినట్లు వివరించారు. ప్రస్తుతం టెలినార్ గ్రూప్ 13 దేశాల్లో టెలికాం సేవలను అందిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uninor  Telenor  India  Telecom  Services  Uninor network  

Other Articles