College Girls Using Mobile Phone More Hours Than Boys According To The Latest Survey | Mobile Addiction

College girls using mobile phone more hours than boys

college girls using mobiles, girls using mobiles, boys using mobiles, college girls vs boys, texas university, texas baylor university, professor james robert team, girls fun with mobiles

College Girls Using Mobile Phone More Hours Than Boys : College Girls Using Mobile Phone More Hours Than Boys According To The Latest Survey. Boys Using Mobiles For Entertainment Where Girls For Social Websites.

ఆ విషయంలోనూ అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ!

Posted: 09/21/2015 06:41 PM IST
College girls using mobile phone more hours than boys

ప్రస్తుత ఆధునిక యుగంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్నిరంగాల్లోనూ ముందున్నారని ఎన్నో నివేదికల్లో వెల్లడైంది. విద్యాభ్యాసంలోనూ, క్రీడారంగంలోనూ, తెలివిలోనూ, టెక్నికల్ విభాగంలోనూ.. ఇలా మరెన్నో రంగాల్లో అమ్మాయిలు సత్తా చాటుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మరో విషయంలో అధ్యయనం చేయగా.. అందులోనూ అమ్మాయిలే ముందున్నారని తేలడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఏ విషయంలో అమ్మాయిలు ముందున్నారు? అని అనుకుంటున్నారా! మరేదోకాదు.. సెల్ ఫోన్ వాడకంలో! అవును.. కాలేజీల్లో చదువుకుంటున్న అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా సెల్ ఫోన్ లతో కాలక్షేపం చేస్తున్నట్లు తాజాగా అమెరికాలోని ఓ యూనివర్సిటీ బృందం నిర్వహించిన నివేదికలో వెల్లడైంది.

నేటి జనరేషన్ లో మొబైల్ వాడకం ఎంతమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా యూత్ మొబైల్ ఫోన్ లేనిదే ఇంట్లో నుంచి బయటకు అడుగు వేయరు. సెల్ ఫోనే తమ లోకం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. సోషల్ మాధ్యమాలు మరి ఎక్కువైన నేపథ్యంలో మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టెక్సాస్ లోని బేలర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ రాబర్ట్స్ బృందం.. మొబైల్ ఎక్కువగా ఎవరు వాడుతున్నారన్న అంశంపై పరిశోధన చేసింది. ఆన్ లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించగా.. అమ్మాయిలు 10 గంటలు, అబ్బాయిలు 8 గంటలు సెల్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లు తేలింది. దాదాపు 60 శాతం మంది విద్యార్థులు తాము సెల్ ఫోన్లకు బానిసలయ్యామని అంగీకరించినట్లుగా ఆ బృందం తెలిపింది. సెల్ ఫోన్ లో ఇంటర్నెట్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్ తదితరాలపై ఎక్కువ సమయం గడుపుతుంటారని తేలింది.

ఈ నివేదికలో వెల్లడైన ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. అబ్బాయిలు ఎంటర్ టైన్ మెంట్ కోసం ఎక్కువగా సెల్ ఫోన్ లు వాడితే.. అమ్మాయిలు మాత్రం సామాజిక విషయాల కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది. వారు చాలావరకు ఇతరులతో చాటింగ్ చేయడంలో సమయం గడుపుతున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే సదరు బృందం విద్యార్థులకు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కువ సమయం సెల్ ఫోన్లను వాడటం వల్ల అది చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అందుకు దాన్ని ఎక్కువగా వాడొద్దని సలహా ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girls using mobiles  boys using mobiles  

Other Articles