A Boyfriend Named Satyakesh Paswan Shoots His Girlfriend Vandana For Getting Ready To Marriage With Other Person | Kanpur Crime News

Boyfriend satyakesh paswan shoots girlfriend vandana in kanpur

satyakesh paswan, vandana, boyfriend shoot girlfriend, satyakesh paswan killed vandana, kanpur crime news, tempo driver killed a girl, maharajpur crime news, jilted man shoots paramour, marriage crime news

Boyfriend Satyakesh Paswan Shoots Girlfriend Vandana In Kanpur : A Boyfriend Named Satyakesh Paswan Shoots His Girlfriend Vandana For Getting Ready To Marriage With Other Person in Kanpur.

ప్రేయసి మరొకరితో పెళ్లికి సిద్ధమైందని..

Posted: 09/21/2015 06:14 PM IST
Boyfriend satyakesh paswan shoots girlfriend vandana in kanpur

‘ప్రేమ జీవితంలో ఒక చిన్న పార్టేగానీ.. ప్రేమే జీవితం కాదు’ అనే విషయాన్ని నేటి యువతరం అర్థం చేసుకోలేకపోతోంది. ప్రేమలో ఎంతగా లీనమైపోతున్నారంటే.. అది లేకపోతే తమ భవిష్యత్తే లేదని భావిస్తూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రేయసి దక్కలేదని ఆత్మహత్య చేసుకోవడం లేదా ఆమెనే చంపేయడం లాంటి సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. తాజాగా ఆ తరహాలోనే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి మరొకరితో పెళ్లికి సిద్ధమైందని తెలుసుకున్న ప్రేమికుడు.. నేరుగా వచ్చి ఆమెను దారుణంగా కాల్చి చంపాడు. ఆపై తనని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్లగా.. సత్యకేశ్ పాశ్వాన్ అనే 26 ఏళ్ల యువకుడు గతకొంతకాలంగా ఓ టెంపో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఓ సందర్భంలో వందన అనే 22 ఏళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ప్రేమలో పూర్తిగా లీనమైన ఆ పావురాలు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఇంతలోనే వందనకి ఆమె కుటుంబసభ్యులు సంబంధం చూసి పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి భయపడ్డ ఆ అమ్మాయి.. చివరికి కుటుంబం ఒత్తిడి నేపథ్యంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న పాశ్వాన్.. ఒక్కసారిగా ఆగ్రహంతో కర్కశుడై ఆమెను దారుణంగా కాల్చి చంపేశాడు. ఆపై తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారిరువురి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyakesh paswan  vandana  boyfriend shoot girlfriend  

Other Articles