AP CM Chabdrababu naidu meeting with search committee

Ap cm chabdrababu naidu meeting with search committee

Chandrababu Naidu, Revanth Reddy, Hyderabad, TTDP, Errabelli Dayakar Rao, Mothkupalli narsimlu, Ramana

AP CM Chabdrababu naidu meeting with search committee. in Hyderabad chandrababu naidu dicussing about the new boss of TTDP.

సెర్చ్ కమిటితో చంద్రబాబు.. రేవంత్ వర్గంలో టెన్షన్

Posted: 09/18/2015 09:23 AM IST
Ap cm chabdrababu naidu meeting with search committee

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో తెలంగాణ సీనియర్ నాయకులతో, పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖకు ఎవరిని బాస్ చెయ్యాలనేదాని మీద సెర్చ కమిటి సమావేశం ప్రారంభమైంది. తెలుగుదేశం అధినేతతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత ఎల్. రమణ, సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, తెలంగాణ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిలు హాజరయ్యారు. అయితే తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలన్న దాని మీద టిడిపి పార్టీ నిర్వహించిన ఐవిఆర్ఎస్ ఫలితాల మీద పార్టీ అధినేత సమావేశంలో చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ పగ్గాలను ఎవరికి అప్పగించాలన్న దాని మీద ప్రస్తుత సమావేశం జరగుతోంది.

ఓ పక్క తెలుగుదేం పార్టీ అధినేతతో కీలక నేతల సమావేశం కొనసాగుతుండగా రేవంత్ రెడ్డి అభిమానులు, రేవంత్ వర్గంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటిస్తారని అందరూ ఊహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు మీడియాలో కూడా రేవంత్ రెడ్డికే తెలుగుదేశం తెలంగాణ పార్టీ పగ్గాలు అంటూ వస్తున్న వార్తలు వెల్లడయ్యాయి. అయితే ప్రస్తుతం కేవలం నామమాత్రపు మీటింగ్ మాత్రమే అని అనుకుంటన్నారు చాలా మంది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థం కాదని.. రేవంత్ పేరును అధినేత వెల్లడించే వరకు నమ్మడానికి లేదని కూడా కొంత మంది అనుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles