Is there Maoists in karimnagar

Is there maoists in karimnagar

Karimnagar, telangana, warangal, first encounter, Maoist

Is there Maoists in karimnagar. Police searching for the information of maos in telangana state. After Warangal encounter police coombing is going on.

కరీంనగర్ లో నక్సలైట్ల కదలికలు..?

Posted: 09/18/2015 08:28 AM IST
Is there maoists in karimnagar

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే సమయంలో వచ్చిన మొదటి అడ్డంకు.. తెలంగాణ ఏర్పడితే మావోలకు మరింత బలం చేకూరుతుంది.. వారిని అడ్డుకోవడం చాలా కష్టం అని. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అదే సమస్య తలెత్తుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరంగల్ జిల్లా అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు మృతి చెందారు. అయితే గత కొంత కాలంగా మావోల కదలికలు లేవు..  ఎలాంటి కార్యక్రమాలు.. దాడులకు మావోలు పాల్పడలేదు.అయితే వరంగల్ లో జరిగిన ఎన్ కౌంటర్ తో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీసులు మావోల మీద పూర్తి స్థాయి దృష్టిసారించారు.

వరంగల్ ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రతీకార దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఇంటలిజెన్స్‌ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లేరు లేరు అనుకున్న మావోల కదలికలతో ఇక మళ్లీ కూంబింగ్ ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత కరీంనగర్‌ జిల్లాలోనూ హై అలర్ట్ బెల్స్‌ మోగుతున్నాయి. కొద్దికాలంటా.. మంథని డివిజన్‌లో వాల్ పోస్టర్లతో అలజడి రేపారు మావోయిస్టులు. మావోల కదలికలు ఉన్న ప్రాణహిత-గోదావరి తీరంలో ముమ్మరంగా కూంబింగ్ కొనసాగుతోంది. జిల్లాలో పెద్దందార్ల సమాచారాన్ని మావోయిస్టులు సేకరిస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పేదల భూములను తక్కువ ధరకు కొన్న ఓ కాంగ్రేస్ జడ్పీటీసితో పాటుగా మరో నాయకునికి భూములను తిరిగి పేదలకు అప్పగించాలంటూ అల్టిమేటం ఇచ్చారు.  దీంతో జిల్లాలో మావోయిస్టులు మెరుపు దాడులకు పాల్పడొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలైన కాటారం, మహదేవ్ పూర్, మండలాల్లో ఇటీవల కాలంలో విస్తృతంగా మావోల వాల్ పోస్టర్ లు వెలిసిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలను చేస్తున్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karimnagar  telangana  warangal  first encounter  Maoist  

Other Articles