young woman betrayed by lover in brahmamgari matham

Young woman harrassed mentally and physically by lover

young woman betrayed by lover, young woman harrassed by lover, lover cut young girls hand by blade,, sadits cuts lover hand by blade, nudity videos, black mailing, ysr cadappa district, kadapa district, young woman, betrayed, lover, brahmamgari matham

young woman harrassed mentally and physically by lover, who betrayed her in the pretext of lover in kadapa district brahmamgari matham

శాడిస్టు చేతిలో చిత్ర హింసలు.. గత్యంతరం లేక పోలీసులకు పిర్యాదు

Posted: 09/16/2015 06:27 PM IST
Young woman harrassed mentally and physically by lover

అమ్మాయిలను మాయమాటలతో వలలో వేసుకోవడంలో ఆరితేరి ఓ శాడిస్టు.. అమెను బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు శారీరికంగా, మానసికంగా హింసించసాగాడు. రోజురోజుకు పెరుగుతున్న శాడిస్టు ప్రేమికుడి ఆగడాలను భరించలేక గత్యంతరం లేని పరిస్థితులలో ఓ మహిళ పోలీసులకు పిర్యాదు చేసింది. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం ప్రాంతానికి వలస వచ్చిన ఓ కుటుంబం.. ఓ ఇంట్లో అద్దెకు దిగింది. అద్దింట్లో నివాసముంటున్న మహిళపై ఇంటి యాజమాని కొడుకు కన్నేశాడు. మాట మాట కలిపి ప్రేమలోకి దించాడు. మాయమాటలతో నమ్మించి ఆమెను లొంగదీసుకున్నాడు.

గొర్రె కసాయివాడిని నమ్మినట్లు అమె వాడిన పూర్తిగా నమ్మింది. అంతే అమెను తనతో ఏకాంతంలోకి రావాలని ముందుగా బ్లాక్ మెయిల్ చేశాడు. ఎట్టకేలకు ముగ్గులోకి దింపాడు. అంతటితో ఆగకుండా.. అమె తనతో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ అమెతో పదే పదే కోరిక తీర్చుకునేవాడు. అక్కడితో ఆగకుండా శరీరాన్ని బ్లేడ్లతో కట్ చేసి శాడిజాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతగాడి శాడిజం శిఖరస్థాయికి చేరడంతో బాధితురాలు తన ఆవేదన బయటపెట్టింది. వైఎస్ఆర్ జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఈ ఉదంతం వెలుగు చూసింది.

పవన్ కుమార్ అనే తమ ఇంటి యజమాని కుమారుడు తనతో కిరాతకంగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. ప్రేమ ముసుగులో తనకు శారీరకంగా దగ్గరయి, ఈ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె వాపోయింది. అతనో శాడిస్టని, తన శరీరాన్ని బ్లేడ్లతో కోసి శాడిజాన్ని ప్రదర్శిస్తూ పైశాచిక ఆనందం పొందేవాడని తెలిపింది. పవన్ బారి నుంచి తనను కాపాడాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది. నిందితుడు పవన్ కుమార్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నవీన్ గులాటి తెలిపారు. అతడిపై మరికొన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : young woman  betrayed  lover  brahmamgari matham  

Other Articles