student harrassed by collage lecturer in kurnool

Inter collage lecturer harrasses student in the pretext of marraige in kurnool

collage lecturer, student, molestation, harrassement, kurnool, intermediate collage girl harrassed by lecturer, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

lecturer harrasses intermiediate collage student in the pretext of marraige in kurnool, parents complained to police

విద్యార్థినిని వేధించిన లెక్చరర్ కు దేహశుద్ది.. పోలీసులకు అప్పగింత

Posted: 09/15/2015 10:46 PM IST
Inter collage lecturer harrasses student in the pretext of marraige in kurnool

విద్యార్థినిని వేధించిన ఓ లెక్చరర్ కు అమె తల్లిదండ్రులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తన కూతురు వయస్సున్న అమ్మాయిని అని కూడా లెక్కచేయకుండా అమెను తాను పరిణయమాడుతానని నిత్యం వేధిస్తూ.. కీచకపర్వానికి తెరతీయడంతో రంగంలోకి దిగిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు కళాశాలకు చేరుకుని లెక్చరర్ దేశశుద్ది చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధించసాగాడు.

గురువు స్తానంలో వున్ననన్న గురుతర భాధ్యతను కూడా మర్చిపోయి తన విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో చేసేది లేక తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపింది.  దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్‌పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : collage lecturer  student  molestation  harrassement  kurnool  

Other Articles