350 prisoners great escape

At least 350 prisoners escape from afghan jail

Afghan, kabul, jail, Escape, Taliban, Bombs

at least 350 prisoners escape from Afghan jail More than 350 inmates escaped an Afghan prison following a coordinated attack by Taliban insurgents, an Afghan official and the Taliban said. Mohammad Ali Ahmadi, deputy governor of Ghazni province, said Monday that insurgents wearing military uniforms launched a well-organized attack early Monday morning that included using a suicide bomber to breach the compound's walls.

ఒకేసారి 350 మంది ఖైదీలు పరార్

Posted: 09/14/2015 03:28 PM IST
At least 350 prisoners escape from afghan jail

ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు అని తెలుగు సినిమా డైలాగ్ ఉంది. కానీ కాబూల్ లో ఉంటున్న ఖైదీలు అచ్చంగా ఒక్కొక్కరు కాదు ఏకంగా 350 మంది కలిసి ఎస్కేప్ అయ్యారు. జైల్ లో ఉండేది అసలే కన్నింగ్ ఫెలోస్ మరి. వారికి ఛాన్స్ వస్తే మాత్రం వదులుకుంటారా ఏంటీ..? సందు దొరికితే చాలు ఖైదీలందరూ కట్టగట్టుకొని వెళ్లిపోయిన ఘటన కాబూల్ లో చోటుచేసుకుంది. ఇక ఖైదీలందరూ పారిపోయాక.. వారి కొసం వెతకడం పోలీసుల పనైపోయింది. మొత్తానికి సినిమా స్టైల్లో జరిగిన 350 మంది ఖైదీల పరారీ మీద ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ అంత మంది ఎలా తప్పించుకున్నారో తెలుసా..? గోడకు కన్నం కొట్టి. అవును జైలు గోడలకు పెద్ద కన్నం కొట్టి అందులోంచి పారిపోయారు. అవును ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

కాబూల్ లో తాలిబన్ ఉగ్రవాదులకు అక్కడి పోలీసులకు ఎప్పుడూ పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే అలాగే స్థానిక కాలమానం ప్రకారం అక్కడ అర్దరాత్రి రెండు గంటల సమయంలో తాలిబన్ ఉగ్రవాదులు జైలు మీద బాంబ్ లతో దాడికి దిగారు. కారులో భారీగా బాంబ్ లు వేసుకొని వచ్చి.. జైలు మెయిన్ డోర్ ను గుద్ది లోపలికి ప్రవేశించారు. పోలీసుల డ్రెస్ లో వచ్చిన ఉగ్రవాదులు పోలీసులను కాల్చి చంపారు. అయితే ఇదంతా జరుగుతుండగానే ఖైదీలు గోడకు కన్నం వేసి.. వెనకాల నుండి పారిపోయారు. అసలు విషయం అందరికి అర్థం అయ్యేలోపు 350 మంది ఖైదీలు జంప్ అయ్యారు. సినిమా స్టోరీలాగా 350 ఖైదీల ఎస్కేప్ భలే ధ్రిల్లింగ్ గా ఉంది కదా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghan  kabul  jail  Escape  Taliban  Bombs  

Other Articles