An elephant follows Balakrsihna Dailouge

An elephant follows balakrsihna dailouge

Elephant, West Bengal, NH31, Elephant attack

An elephant follows Balakrsihna Dailouge. In West bengal, Bikers tried to escape from the elephant which blocked the High way.

ITEMVIDEOS: బాలకృష్ణ డైలాగ్ ఆ ఏనుగుకు సూట్ అవుతుంది

Posted: 09/14/2015 01:42 PM IST
An elephant follows balakrsihna dailouge

బాలకృష్ణ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది.. నాకు ఎదురొచ్చినా..వాడికే రిస్క్  నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్ అని. నిజమే సినిమాలో హీరోలకు విలన్లు ఎదురెళితే అలానే ఉంటుంది. మరి నిజంగా ఇలాంటి సీనే జరిగితే ఎలా ఉంటుంది. అచ్చంగా ఇలాంటి సీనే పశ్చిమ బెంగాల్ లో జరిగింది. ఓ ఏనుగుకు ఎదురెళ్లి అపాయం తలుపు తట్టి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీసిన ఇద్దరు వ్యక్తుల పరిస్థితి. అసలే ఏనుగు.. ఆ మీద చిర్రెత్తి ఉంది.. దానికి ఎదురెళితే ఎలా ఉంటుంది.. తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది.

పశ్చిమ బెంగాల లోని జల్పాయ్ గురి జిల్లాలోని గొరుమారా అడవుల గుండా వెళ్లే 31వ నుంబర్ జాతీయ రహదారి మీదకు ఓ పెద్ద ఏనుగు వచ్చింది. దాంతో రెండు వైపులా అన్ని వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఏనుగు ఉంది అని కూడా పట్టించుకోకుండా దాన్ని దాటివెళదామని ఇద్దరు వ్యక్తు అనుకుని.. బైక్ స్టార్ట్ చేశారు. అయితే వాళ్లు వస్తున్న విషయాన్ని గమనించిన ఏనుగు వారి మీదకు దాడికి దిగింది. దాంతో బైక్ ను వదిలేసి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని .ప్రాణాల కోసం పరుగెత్తడం వారివంతైంది. మరదే బాలకృష్ణ గారు చెప్పినట్లు ఏనుగుకు మీరు ఎదురెళ్లినా.. ఏనుగు మీకు ఎదురొచ్చినా మీకే రిస్క్.. ఆ రకంగా చెప్సుకోవచ్చన్న మాట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Elephant  West Bengal  NH31  Elephant attack  

Other Articles