Will Modi complaints about Candy Crush

Twitteratis request pm modi to ask mark zuckerberg to stop candy crush notifications on facebook

modi, Facebook, Twitter, Candycrush, Notifications, Mark Zuckerberg, Candy Crush notifications in Facebook

As the news came in about Narendra Modi's impending visit to the Facebook headquarters in California on September 27 where he is scheduled to hold a town hall interaction with its CEO Mark Zuckerberg, requests poured in on social networking site Twitter asking the Prime Minister to intervene on the matter of Candy Crush notifications.

క్యాండీక్రష్ మీద మోదీ కంప్లైంట్..?

Posted: 09/14/2015 10:22 AM IST
Twitteratis request pm modi to ask mark zuckerberg to stop candy crush notifications on facebook

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియాను ఏ లెవల్ లో వాడుతున్నారో.. సోషల్ మీడియాలో తనకంటూ ఏ స్థానాన్ని సంపాదించారో అందరికి తెలుసు. అయితే తాజాగా మోదీజీ ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ తో సమావేశం కానున్నారు. ఫేస్ బుక్ ద్వారా డైరెక్ట్ గా ప్రజలతో ఇంటరాక్ట్ కానున్నారు. ఫేస్ బుక్ వేదికగా ప్రజలు అడిగే ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెప్పనున్నారు. ప్రపంచం మొత్తం ఫేస్ బుక్ మాయలో ఉంటే.. మోదీ అదే టాపిక్ ను క్యాచ్ చేసి.. తన స్ట్రాటజీని చూపిస్తున్నారు. అంతా బాగానే ఉంది.. ప్రతి చోట మోదీ , షేస్ బుక్ గురించే మాట్లాడుతున్నారు. అయితే మోదీ, ఫేస్ బుక్ మధ్యలో క్యాండీక్రష్ వచ్చి చేరింది. అవును.. క్యాండీక్రష్ గేమ్ గురించి తెలియని వాళ్లు ఎవరూ లేరు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యాండీక్రష్  గేమ్ తో టైంపాస్ చేస్తుంటారు. అయితే మోదీ క్యాండీక్రష్ మీద ఓ కంప్లైంట్ ఇవ్వనున్నారా..? అన్న చర్చ అన్ని చోట్లా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గేమ్ లందు.. క్యాండీక్రష్ వేరయా అన్నట్లు.. ఎన్నో గేమ్ లు ఉన్నా కానీ క్యాండీక్రష్ ఫాలోయింగ్ మాత్రం అదిరిపోయింది. అయితే ఆడేవాళ్లు ఆడుతూనే ఉన్నారు. గేమ్ లాస్ అయిన వారు మరో స్టేజ్ కు, లైఫ్ కోసం సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్ బుక్ లో క్యాండీక్రష్ గేమ్ నోటిఫికేషన్ పంపిస్తుంటారు. అయితే ఫేస్ బుక్ లో చాలా నోటిఫికేషన్లు క్యాండీక్రష్ గురించే ఉండటం ఫేస్ బుక్ లవర్స్ కు చిరకు తెప్పిస్తోంది. అందుకే ఎలాగూ.. మన మోదీ గారు ఫేస్ బుక్ స్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ ను కలుస్తున్నారు కదా.. కాబట్టి మన ప్రాబ్లం చెప్పుకుంటే తీరుస్తారని అనుకున్నారు. ట్విట్టర్ ద్వారా మోదీ గారికి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అయ్యా మోదీ గారు ఫేస్ బుక్ లో క్యాండీక్రష్ నోటిఫికేషన్ల గొడవ ఎక్కువైంది. కాబట్టి వాటిని ఆపించండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరి మోదీ గారు అందరికి రిక్వెస్ట్ ను మన్నించి మార్క్ జుకెన్ బర్గ్ కు నిజంగా కంప్లూంట్ చేస్తారా..? లేదా వదిలేస్తారా చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles