CRDA Introduce New Plan Of Amaravathi Township In 20 Acres For Govt Offices And Other Sectors | AP Capital City

Crda new plan amaravathi township 20 acres govt sectors private companies

amaravathi township, amaravathi master plan, amaravathi latest news, amaravathi images, amaravathi photo gallery, amaravathi updates, ap capital city, ap capital amaravathi plan, amaravathi township 20 acres, crda amaravathi plans, crda master plan amaravathi

CRDA New Plan Amaravathi Township 20 Acres Govt Sectors Private Companies : CRDA Introduce New Plan Of Amaravathi Township In 20 Acres For Govt Offices And Other Sectors.

అమరావతి ‘టౌన్ షిప్’.. అందుకోసమేనా?

Posted: 09/14/2015 10:21 AM IST
Crda new plan amaravathi township 20 acres govt sectors private companies

నూతన రాజధాని నిర్మాణం ఊపందుకోవాలంటే.. ముందుగా ఆ ప్రాంతంలో ప్రభుత్వ కార్యకలాపాలు, వాణిజ్యపరమైన శాఖలు అవసరమవుతాయని గ్రహించిన కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డీఏ).. ఆ దిశగా పావులు కదుపుతోంది. సర్కారు కార్యాలయాలు, వాణిజ్య అవసరాల కోసం 20 ఎకరాల్లో అమరావతి టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టాలని ఆ సంస్థ నిర్ణయించింది.

రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవాలంటే వీలైనంత త్వరగా అమరావతి నుంచే పరిపాలన సాగాలని, ఇందుకు అవసరమైన ప్రభుత్వ శాఖలు, వాటిల్లోని ఉద్యోగులను అమరావతికి తరలించాలని సీఆర్‌డీఏ పేర్కొంది. ఉద్యోగులను తరలించాలంటే.. కనీసం ఐదు లక్షల చదరపు అడుగుల్లో కార్యాలయాల, వాణిజ్య కార్యకలాపాలకోసం నిర్మాణాలు చేయాల్సి ఉందని సీఆర్‌డీఏ తెలిపింది. తక్షణ అవసరాల కోసం నిర్మించే ఆ భవంతుల్లో 10 వేల మంది ఉద్యోగుల పనిచేయడానికి వీలు కలుగుతుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ప్రైవేట్ సంస్థతో సంయుక్త డెవలపర్ విధానంలో నిర్మాణాలను చేపట్టాలని, ఈ విధానంలో భాగంగా ఆ 20 ఎకరాలను ప్రైవేట్ సంస్థకు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని, ఇందులో సీఆర్‌డీఏకు కొద్దిపాటి వాటా ఉంటుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మూడు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి సీఆర్‌డీఏ పంపింది.

* సీఆర్‌డీఏ కోసం 20 ఎకరాల్లో ఐదు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను సంయుక్త డెవలపర్‌గా ఉండే ప్రైవేట్ సంస్థ చేపడతుంది. దానికి ప్రతిఫలంగా ఆ ప్రైవేట్ సంస్థకు 10 ఎకరాల్లోని డెవలప్‌మెంట్‌ను విక్రయించుకునే హక్కు ఇవ్వాల్సి వుంటుంది.
* 99 సంవత్సరాలపాటు లీజు విధానంలోనే ఆ విక్రయాలు ఉండాలనే నిబంధన విధించనున్నారు. అలా జరగని పక్షంలో.. సీఆర్‌డీఏకు అవసరమైన నిర్మాణాల కోసం రూ. 15 కోట్లు సొంత నిధులనే వెచ్చించడం.
* సంయుక్త డెవలపర్ విధానంలోనే ఆ 20 ఎకరాలను 99 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తూ ప్రైవేట్ డెవలపర్‌ను ఎంపిక చేయడం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Capital City Amaravathi  Amaravathi TownShip  CRDA Plans  

Other Articles