Kenya revolution against the rape

Kenyas unique approach to prevent rapes

Kenya, rape, No Means No Kenya, Revolution

Kenyas Unique Approach To Prevent Rapes The ongoing problem of rape raises the heckles all over the world. Kenya’s unique approach to prevent rape should be noted and kept as an example for the rest of the world. Kenya has faced the trauma of having more no of rapes than anywhere . One out of four women or girls have been sexually assaulted. Schoolgirls were frequently raped by friends and boyfriends. Clothes have been torn from women’s bodies in public.

ITEMVIDEOS: రేప్ లు జరగకుండా అలా చేస్తున్నారు

Posted: 09/12/2015 12:51 PM IST
Kenyas unique approach to prevent rapes

రేప్ లు చేసే వాళ్లు.. వాటికి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంటోంది. ఒక్క ఇండియానో, పాకిస్థానో లేదా మరే దేశమో కాదు అన్నీ దేశాల్లోనూ కామాంధులు అమ్మాయిలను రేప్ చేస్తూనే ఉన్నారు. అయితే రేప్ లే కాదు... శారీరకంగా హింసించడం.. కూడా అమ్మాయిలు, అబ్బాయిలు ఎదురుకుంటున్నారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న విష సంసృతి మీద కెన్యాలో ఓ విప్లవం లేచింది. దేశంలో రేప్ లు జరగకుండా అక్కడ స్థానికంగా చాపు కింద నీరులా ఉద్యమం లేస్తోంది. అయితే ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నది అనుకునేరు.. కేవలం రేప్ లకు వ్యతిరేకంగా చేస్తున్నది మాత్రమే.

కెన్యాలో ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరి మీద రేప్ ఘటన జరుగుతోంది. బాలబాలికల మీద లైంగిక దాడుల సంఖ్య కూడా ఎక్కువే. అయితే అంతకంతకు మించుతున్న ఇలాంటి ఘటనల మీద అక్కడి ప్రజలు విప్లవానికి నాంది పలికారు. నో మీన్స్ నో కెన్యా.. నో వరల్డ్ అంటూ కొత్త నినాదాన్ని కొత్త ఆలోచనలకు దారి తీసింది. తాజాగా రేప్ లు, అత్యాచారాల మీద అక్కడి విద్యార్థులు, యువకులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు. వారిని మోటివేట్ చేస్తున్నారు. రేప్ కు గురైన వారిని ఎలా ట్రీట్ చెయ్యాలి.. వారిని మామూలుగా ఎలా చూడాలి.. వారికి ఎలా ఆర్థికంగా, మానసికంగా సిద్దం చెయ్యాలి అన్న కోణంలో అందరికి అవగాహన కల్పిస్తూ ఎంతో మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. కెన్యా నిజానికి చిన్న దేశం. పేద దేశం అయినా కానీ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించి వారిలోని మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇలా ప్రతి దేశంలోనూ అవగాహన పెరిగి.. రేప్ చేసిన వారికి బాసటగా నిలుస్తూ. రేప్ జరగకుండా చూసుకుంటే ఆ దేశం నిజంగా అభివృద్ది చెందిన దేశంగా ఉంటుంది. అలా అన్ని దేశాలు కూడా ఉండాలని కోరుకుందాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kenya  rape  No Means No Kenya  Revolution  

Other Articles