A New Twist In Sheena Bora Murder | Indrani Mukherjea Updates | Mumbai Police Investigation | Driver Shyam

Sheena bora murder case indrani mukherjea statements mumbai police investigation

sheena bora murder case, indrani mukherjea custody, indrani mukherjea court, sheena bora history, sheena bora murder mystery, sheena bora family photos, driver shyam, sanjeev khanna updates

Sheena Bora Murder Case Indrani Mukherjea Statements Mumbai Police Investigation : New Twist In Sheena Bora Murder. Police Found The Reason Behind Her Murder.

కొత్త ట్విస్ట్: తల్లినే బ్లాక్ మెయిల్ చేసిన షీనాబోరా!

Posted: 09/12/2015 12:40 PM IST
Sheena bora murder case indrani mukherjea statements mumbai police investigation

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసు.. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలాగా ట్విస్టుల మీద ట్విస్టులతో కొనసాగుతూనే వుంది. ఈ కేసును తప్పుదోన పట్టించేందుకు ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా ఇప్పటికే ఎన్నో కథలు అల్లగా.. పోలీసుల విచారణలో భాగంగా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏ విధంగా అయితే కూతురు షీనాని తల్లి ఇంద్రాణి హతమార్చిందో.. అలాగే తన కొడుకుగా ప్రపంచాన్ని పరిచయం చేసిన మిఖాయిన్ ని చంపేందుకు పథకం రచించినట్లు ఆమధ్య పోలీసులకు తెలియడంతో మరో కేసు ఆమెపై నమోదు చేశారు. ఆ సందర్భంలో మిఖాయిల్ తన కొడుకే కాదంటూ ఇంద్రాణి సంచలనం సృష్టించింది. అంతకుముందు షీనా అమెరికాలో బతికే వుందంటూ మరో సంచలనానికి తెరలేపిన విషయం తెలిసిందే! ఇలా ఎన్నో ట్విస్టుల నడుమ నడుస్తున్న ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగుచూసింది.

షీనాబోరా హత్యకు గురవ్వడానికి ముందు తన తల్లి ఇంద్రాణి ముఖర్జియాని అనునిత్యం బ్లాక్ మెయిల్ చేసిందట. తన గత జీవితాన్ని బట్టబయలు చేస్తానంటూ తల్లిని షీనా బెదిరించేదట. ముంబైలోని అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ కావాలని కోరిందట. అది కొనివ్వకుంటే, ఇంద్రాణి గత జీవితపు రహస్యాలను బయట పెడతానని బెదిరించిందనట్లు విచారణలో తేలింది. ఈ విధంగా షీనా బెదిరింపులకు పాల్పడడటంతో.. ఇంద్రాణి తీవ్ర ఆగ్రహానికి, మనోవేదనకు గురై ఆమెను చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. షీనా మెడకు తాడు బిగించి హత్య చేసే క్రమంలో ఆమె నోరును గట్టిగా మూసిన తరువాత, ఇంద్రాణి పదేపదే ‘ఇక తీస్కో నీ త్రీ బెడ్ రూం ఫ్లాట్’ అంటూ పిచ్చిగా అరిచిందట. ఈ విషయాన్ని కారు డ్రైవర్ రాయ్ పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. పీటర్ ముఖర్జియాకు చెందిన ఆస్తి లావాదేవీలు కూడా హత్యకు మరో కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheena bora murder case  indrani mukherjea custody  

Other Articles