Singapore PM Lee Hsien Loong Write A Letter To AP CM Chandrababu Naidu After Winning Elections | AP Capital City Amaravathi

Singapore pm lee hsien loong write letter ap cm chandrababu naidu

singapore pm lee hsien loong, lee hsien loong with chandrababu naidu, chandrababu with singapore pm, ap capital city amaravathi, amaravathi master plan, amaravathi latest images, singapore photos

Singapore PM Lee Hsien Loong Write Letter AP CM Chandrababu Naidu : Singapore PM Lee Hsien Loong Write A Letter To AP CM Chandrababu Naidu After Winning Elections.

చంద్రబాబు ‘హస్తం’ కోరిన సింగపూర్ ప్రధాని

Posted: 09/12/2015 11:20 AM IST
Singapore pm lee hsien loong write letter ap cm chandrababu naidu

విశ్వవిఖ్యాత దేశాల్లో ఒకటైన సింగపూర్ తో ఏపీ చంద్రబాబు నాయుడికి గట్టి బంధమే వుంది. అందుకే.. ఏ సందర్భంలోనైనా రాజధాని విషయమై ప్రస్తావించినప్పుడు ఆయన సింగపూర్ మాట ఎత్తనిదే ఉండలేరు. అక్కడి అభివృద్ధి పనులు ఎంతో వేగవంతంగా వుండటమే కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడి వుంటాయి కాబట్టి.. ఏపీ రాజధాని ‘అమరావతి’ నిర్మాణాన్ని సింగపూర్ కి అప్పగించారు. ఈ కారణం వల్లనే ఏమో.. ఆ దేశ ప్రధాని ఈయనతో స్నేహంగా మెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇందుకు సాక్ష్యంగా.. స్వయంగా ఆయన బాబుకు రాసిన తాజా లేఖ నిలుస్తుందని చెప్పుకోవడం ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ వార్తే తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తోంది.

సింగపూర్ ప్రధాని అయిన ఎల్.హెచ్.లూంగ్ శుక్రవారం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని అందులో ఆయన బాబుకు సూచించారు. ఇంతకీ ఆ లేఖ ఎందుకు రాశారంటే.. ఇటీవల సింగపూర్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అధికార ‘పీపుల్స్ యాక్షన్ పార్టీ’ మరోసారి స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ప్రధానిగా కొనసాగుతున్న లూంగ్ తదుపరి కూడా ఆ బాధ్యతల్ని చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన పార్టీ విజయాన్ని ప్రస్తావిస్తూ బాబుకు లేఖ రాశారు. ‘నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇలాగే మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వున్నాం’ అని లూంగ్ ఆ లేఖలో పేర్కొన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singapore pm lee hsien loong  Chandrababu Naidu  Ap capital city amaravathi  

Other Articles