China: Man posts selfie with girlfriend's corpse, arrested for murder

Viral man posts selfie with girlfriend s corpse

China: Man posts selfie with girlfriend's corpse, china man arrested for girl friend murder, china man selfie goes viral on social media, china police arrest man posting selfie with GF corpse, china, selfie, corpse, arrest, girl friend, social media

A man has been arrested in China for allegedly murdering his girlfriend after a selfie he posted with her corpse went viral on social media.

నెట్ లో హల్ చల్.. ప్రియురాలి మృతదేహంతో సెల్పీ.. అరెస్టు

Posted: 09/11/2015 08:08 PM IST
Viral man posts selfie with girlfriend s corpse

చైనాలోని బీజింగ్ పట్టణంలో కిన్ అనే యువకుడ్ని అక్కడి పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఎందుకు అన్న సందేహం కలుగుతుంది కదూ.. ఈ యువకుడు సెల్పీ దిగాడని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. అదేంటి సెల్పీ దిగినందుకు అరెస్టు చేస్తారా..? అదేమైన నిషిద్ద ప్రదేశమా..? అన్న అనుమానాలు రావచ్చు. కానీ అందుకు కారణం మాత్రం వేరు. నా రూటు సపరేటు అన్నట్లు కిన్ కు కాస్త తిక్క ఎక్కువే. వాడిలో ఏం నచ్చిందో గానీ లీన్ అనే అమ్మాయి వాడికి మనసిచ్చింది. ఇద్దరూ కబుర్లు, షికార్లతో కాలం గడపసాగారు. ప్రతిదానిలో నాదే పైచేయి అన్నట్లుగా వ్యవహరించేవాడు కిన్. సరే, ప్రేమిస్తే అన్ని సర్దుకుపోవాల్సిందేగానని ఊరకుండిపోయింది లీన్.

ఆ క్షమాగుణమే ఆమె పాలిటి మృత్యువు అవుతుందని ఊహించలేదామె. మూడు రోజుల కిందట ప్రేమికులిద్దరూ గొడవపడ్డారు. తప్పు సహజంగా కిన్ దే. మాటామాటా పెరిగింది. ఉన్మాదంతో ఊగిపోతూ  పదునైన ఆయుధంతో లీన్ పై దాడిచేసి చంపేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని అందంగా ముస్తాబుచేసి, పక్కనే పడుకుని సెల్ఫీ తీసి, నెట్లో పోస్ట్ చేశాడు. అంతే.. యావత్ ప్రపంచం ఆ ఫొటోను చూసి ఉన్మాదప్రేమికుణ్ని ఈసడించుకుంది. ఇప్పుడిదే ఫోటో నెట్ లో హల్  చల్  చేస్తోంది. ఇంకేముందు రంగంలోకి దిగిని పోలీసులు కిన్ను అరెస్టు చేశారు. ఇక అతను సెల్ఫీతోపాటు ట్యాగ్ చేసిన మెసేజ్  'ప్లీజ్ ఫర్గివ్ మై సెల్ఫిష్ లవ్..' ను చదివిన యావత్ ప్రపంచ ప్రేమికులు కిన్ ను తిట్టుకుంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  selfie  corpse  arrest  girl friend  social media  

Other Articles