Married woman gang-raped by seven including two minors

Dalit woman gang raped in amaravathi

Rape, Gang rape, dalit woman, minors, maharastra, crime in amaravathi, crime in maharastra, rape in maharastra, gang rape in amaravati, finanancial help, chandur bazar police station, Riddhapur town, Sandeep Thakare, Shiva Jamthe, Santosh Lakhan Sanskar, Prafulla Waghade, Shivam Wankhade, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women

A 25-year-old Dalit woman was allegedly gangraped by seven youths, including two juveniles, on the pretext of giving her financial help in Chandur Bazar police station area in the district,

అమరావతిలో దారుణం..దళిత వివాహితపై గ్యాంగ్ రేప్

Posted: 09/11/2015 07:33 PM IST
Dalit woman gang raped in amaravathi

అమరావతి జిల్లాలో మరో దారుణం జరిగింది. దళిత వివాహితపై ఏడుగురు మృగాళ్లు తమ పైశాచికత్వంతో విరుచుకుపడి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. తనను ఆర్థిక సాయం చేస్తామని నమ్మబలకడంతో.. విశ్వసించిన దళిత వివాహితపై సాయం చేస్తానన్న వ్యక్తి సహా ఏడుగురు అమెపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులలో ఇద్దరు మైనర్లు కూడా వున్నారు.  ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చండూర్ బజార్ పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. తన భర్తతో బేధాభిప్రాయాల కారణంగా.. తన ఏడేళ్ల కూతురుతో దూరంగా వుంటున్న దళిత వివాహత తన కుటుంబపోషణ నిమిత్తం తమ గ్రామంలోని ఓ పరిచయస్తుడు సందీప్ థాక్రేను 1500 రూపాయలు అప్పుగా ఇవ్వాలని కోరింది. సాథ్యమైనంత త్వరగా ఆ డబ్బును తాను తిరిగి చెల్లిస్తానని కూడా చెప్పింది. అయితే ఇదే అదనుగా భావించిన ఆ క్రూరుడు.. అమెను రిద్దాపూర్ పట్టణానికి రావాలని.. అక్కడ తాను అడిగిన డబ్బును సమకూరుస్తానని చెప్పాడు. అయితే తన మిత్రుడిని పంపిస్తానని అతనితో కలసి రావాలని చెప్పాడు.

అనుకున్నట్లుగానే సందీప్ ధాక్రే మిత్రుడు అమె ఇంటికి వెళ్లి బైక్ పై అమెను కూర్చోబెట్టుకుని జాల్నాపూర్-రిద్దాపూర్ రహదారి మార్గంలోని ఫామ్ హౌజ్ కు తీసుకువెళ్లాడు. అక్కడికి వెళ్లగానే అమెపై సందీఫ్ థాక్రే సహా శివ జామ్థే, సంతోష్ లఖన్ సంస్కార్, ప్రఫుల్లా వాఘ్దే సహా ఇద్దరు మైనర్ యువకులు కూడా అమెపై తెగబడి సామూహిక అత్యాచారం చేశారని భాదితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. బాధితురాలి పిర్యాదుమేరకు నిందితులను అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితులపై అత్యాచార కేసులతో ఎస్సీ, ఎస్టీ అక్రాసిటీ కేసులు కూడా నమోదు చేసినట్లు చండూర్ బాజార్ సిఐ ఎస్.ఆర్ రాజ్ పుత్ తెలిపారు. ఈ కేసును తమ డీఎస్సీ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  Gang rape  dalit woman  minors  maharastra  crime news  

Other Articles