keshavareddy educational institute chairman arrested in cheating case

Keshava reddy corporate schools chairman arrest

keshavareddy educational institutes, chairman keshava reddy, arrested, cheating case, parents,approch,police,for,not,refunding,their,amount, Rs 700 crores fraud, lakhs of ruppees, deposits

keshavareddy educational institute chairman keshava reddy arrested in cheating case after parents approch police for not refunding their amount.

డిఫాజిట్ల సేకరణ వెనుకు సదుద్దేశ్యమే.. మోసం చేయాలని లేదు..

Posted: 09/10/2015 07:19 PM IST
Keshava reddy corporate schools chairman arrest

విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి సేకరించిన కోట్లాది రూపాయలను వారికి ఇచ్చిన హామీ మేరకు తిరిగి చెల్లించని కారణంగా కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశరెడ్డిని కర్నూలు సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ. 700 కోట్లకు పైగా అప్పుల ఎగవేతకు పాల్పడ్డారని ఆయనపై అరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. విద్యార్థుల తల్లిందండ్రుల వద్ద రూ.1.5 నుంచి రూ.2 లక్షల వరకు కేశవరెడ్డి విద్యాసంస్థ యాజమాన్యం వసూలు చేసినట్లు ఆధారాలు వున్నాయి. తమ పాఠశాలలో విద్యాభ్యాసం చేసే విద్యార్థుల తల్లిదండ్రులు.. పిల్లలను చేర్పించే సమయంలో ఒక్కో విద్యార్థికి రూపాయలు రెండు లక్షల చోప్పున దరావత్తు చేస్తే.. విద్యార్థుల పదో తరగతి పూర్తైన తరువాత వారి డబ్బును వారికి తిరిగి చెల్లిస్తామని ప్రకటనలు గుప్పించి.. వేలాది మంది విద్యార్థులను తమ పాఠశాలలో చేర్పించుకున్నారు.

అయితే తమ నుంచి సేకరించిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా తల్లిదండ్రులు కోరుతున్నప్పటికీ యాజయాన్యం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధితులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో పలువురు తల్లిదండ్రులు తమ డిపాజిట్లు తమకు ఇప్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కాగా, మంచి ఉద్దేశంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశం తనకు లేదని కేశవరెడ్డి తెలిపారు. మోసం చేయాలనే ఉద్దేశం ఉంటే ఐపీ పెట్టేవాడినని, ఏడాది ఆగితే అందరికీ చెల్లిస్తానని ఆయన తెలిపారు. లేదంటే ప్రభుత్వం తన ఆస్తులను జప్తు చేసుకోవచ్చని అన్నారు. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించటంతో కేశవరెడ్డిపై అయిదు కేసులు నమోదు చేశారు. ఇవాళ ఆయనను రిమాండ్ కు తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : keshavareddy educational institutes  chairman keshava reddy  arrested  

Other Articles