Viral: Vedic teacher beats eight years kid asking caste name

Bantwal video of teacher beating abusing boy goes viral

Vedic teacher beats eight years kid asking caste name, video viral, vedic teacher, injures student, caste, mangalore, karnataka, sheshappa, social media, whatsapp, abusing boy

A video in which a Veda teacher is seen to be beating and abusing a boy with a fractured arm has gone viral in WhatsApp and other social media.

ITEMVIDEOS: క్షతగాత్ర విద్యార్ధిని.. క్షత్రియుడవా..? అంటూ చితకబాదిన ఉపాధ్యాయుడు

Posted: 09/10/2015 07:16 PM IST
Bantwal video of teacher beating abusing boy goes viral

కర్నాటకలోని ఓ వేద పాఠశాలలో  అమానుష ఘటన చోటుచేసుకుంది. బంట్వాల్ జిల్లా విఠల్ గ్రామ పరిధిలో వున్న ఓ వేద పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఓ ఎనిమిదేళ్ల బాలుడి పట్ల వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా వుంది. అక్కడ పనిచేసే ప్రధానోపాధ్యాయుడు సోమసుందరశాస్త్రి అతి కిరాతకంగా వ్యవహరించాడు. కుడి చేయి ఫ్రాక్చర్‌ కావడంతో పాఠశాలకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బ్యాండేజ్ తో అలస్యంగా వచ్చిన క్షతగాత్ర విద్యార్థి పట్ల కనీస కనికరం కూడా లేకుండా చితకగొట్టి మరీ కులం పేరుతో ధూసించాడు. విద్యార్థిని పట్టుకుని చెవి మెలేస్తూ... చితక్కొట్టాడు.



ఈ ఘటన జరిగి చాలా రోజులే అవుతున్నా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలకు వెలుగులోకి రావడం, అంతర్జాలంలో హల్ చల్ చేయడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా సామాజిక మాధ్యమంలో పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి. నువ్వు బ్రాహ్మణుడివా, లేక క్షత్రియుడివా అంటూ బాలుడిని ఆ సోమసుందరశాస్త్రీ చావగొట్టినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల క్రితం కర్నాటకలోని బంట్వాల్‌లో వున్న ఓ వేద పాఠశాలలో జరిగిన ఓ సంఘటన..  ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కలకలం రేపుతోంది. దీనిపై శేషప్ప అనే స్థానిక దళిత్‌ సేవాసమితి నాయకుడు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : video viral  vedic teacher  injures student  caste  mangalore  karnataka  

Other Articles