Ravela Kishore Babu | AP | AIDS

Ap minister ravela kishorebabu tears for aids children

Ravela Kishore Babu, AP, AIDS, Children, Minister Ravela

AP Minister Ravela Kishorebabu tears for AIDS children. In Nellore dist, Ravela interact with children who suffering from AIDS.

కంట తడి పెట్టిన ఏపి మంత్రి

Posted: 09/09/2015 08:29 AM IST
Ap minister ravela kishorebabu tears for aids children

వాళ్ల కథలు కన్నీళ్లు సెట్టిస్తాయి.. వారి జీవితాల వ్యధలు అందరి కళ్లు చమ్మగిళ్లేట్లు చేస్తాయి.. తాజాగా ఏపి మంత్రి గారు ఆ కన్నీటి కథలు విని.. చూసి కంట నీరు పెట్టారు. బరువెక్కిన హృదయంతో వాళ్లనె హత్తుకొని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగింది అనేగా మీ ప్రశ్న. దేవాన్నే కాదు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఎయిడ్స్ మీద అందరూ పోరాటం చేస్తున్నారు.. కానీ ఎంతో మంది ఆ మహమ్మారి బారిన బడి తమ జీవితాలను అర్దంతరంగా ముగిస్తున్నారు. పాల బుగ్గ చిన్నారులు, కనీసం లోకం జాడ కూడా తెలియని చిన్నారులు ఎంతో మంది ఎయిడ్స్ బారిన పడి.. ఏం జరుగుతుందో కూడా తెలియనంత అమాయకంగా బ్రతుకులీడుస్తున్నారు. వారి కథలు అందరికి కన్నీళ్లు పెట్టిస్తాయి.. అభివృద్ది గురించి జబ్బలు చరిచే మనం ఇంకా ఎక్కడున్నాం అనే ప్రశ్న రాకమానదు.

తాజాగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఏపి మంత్రి రావెల కిశోర్ బాబు కొంత మంది ఎయిడ్స్ బాధిత చిన్నారులను పలకరించారు. వారితో మాట్లాడి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ‘మంత్రి గారూ.. నాకు ఎయిడ్స్‌ ఉందంట! అమ్మ, నాన్న చిన్నప్పుడే చచ్చిపోయారు. పిన్ని దగ్గర ఉంటున్నా. ఆమె చాలా మంచిది. నన్ను బాగా చూస్తోంది. ఏదైనా సహాయం చేయండి. నాలాగా ఎయిడ్స్‌తో ఉన్న ఇతర పిల్లలను ఆదుకోండి సార్‌’’.. అంటూ పదేళ్ల బాలుడు చెబుతుంటే మంత్రి చలించిపోయారు. ‘‘మా ఇంటికి వస్తావా! పెంచుకుంటాను’’ అని మంత్రి అడగ్గా.. ‘‘నన్ను మా పిన్ని బాగా చూస్తుంది...నేను అక్కడే ఉంటాను’’ అని ఆ చిన్నారి బదులిచ్చాడు. ఆ ఒక్క బాలుడే కాదు.. మరికొందరు చిన్నారులు ఆరోగ్యపరంగా, సామాజికంగా తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి చెబుతుంటే భావోద్వేగానికి గురైన మంత్రి వేదిక దిగి వచ్చి వారిని హత్తుకుని కంటతడి పెట్టారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు చెందిన 42 మంది ఎయిడ్స్‌ బాధిత చిన్నారులతో వరల్డ్‌ విజన్‌ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముక్కుపచ్చలారని ఆ చిన్నారుల.. తోటి పిల్లలతో ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన వయసులో ఎయిడ్స్‌ కారణంగా వివక్షకు గురవుతున్న వైనం తెలుసుకుని బాధపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravela Kishore Babu  AP  AIDS  Children  Minister Ravela  

Other Articles