Driverless bus in China completes successful test runs

Coming subsequent a driverless bus

riverless bus in China completes successful test runs, Yutong Bus Co. Ltd., Zhengzhou City, Kaifeng City, coming, driverless, next, Tech Guru, Drivesless bus, Unmanned passenger bus, Yutong Bus company, Bus, Henan, China

A Chinese bus-maker has claimed that its driverless bus has completed a successful trial operation on an intercity road in central China's Henan Province, where it automatically changed lanes and stopped at traffic signals.

త్వరలో రానుందహో..! డ్రైవరు లేని బస్సు..!!

Posted: 09/08/2015 10:23 PM IST
Coming subsequent a driverless bus

డ్రైవర్లేని బస్సు వచ్చేసింది. చైనాలో ఈ బస్సును విజయవంతంగా పరీక్షించారు. గత ఆగస్టులో హెనాన్ ప్రావిన్స్లోని  జెంగ్ఝౌ సిటీ-కైఫెంగ్ సిటీ మధ్య ఇంటర్ సిటీ రోడ్డులో 32.6 కిలో మీటర్లు దూరం మేర సురక్షితంగా ప్రయాణించింది.     యుటాంగ్ బస్ కంపెనీ లిమిటెడ్ రూపొందించిన ఈ డ్రైవర్ రహిత బస్సు అన్ని పరీక్షల్లో విజయవంతమైందని చైనా పత్రికలు వెల్లడించాయి. ఇంటర్ సిటీ రోడ్డుపై ఆటోమేటిక్గా లేన్స్ మార్చుకోవడం.. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగడం.. వాహనాలను ఓవర్టేక్ చేయడం వంటి పరీక్షలను పూర్తి చేసింది.

బస్సులో రెండు కెమెరాలు, నాలుగు లేజర్ రాడార్లు, మిల్లీమీటర్ వేవ్ రాడార్ సెట్, నావిగేషన్ సిస్టమ్ను అమర్చారు. వీటి సాయంతో బస్సు నడుస్తుంది. యుటాంగ్ కంపెనీ మూడేళ్ల క్రితం డ్రైవర్ రహిత బస్సును తయారు చేయడానికి పరిశోధనలు మొదలుపెట్టింది. ఈ బస్సును వాడుకలో తీసుకురావాలంటే సాంకేతికను మరింత అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ మద్దతు అవసరమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drivesless bus  Unmanned passenger bus  Yutong Bus company  Bus  Henan  China  

Other Articles