Hardik patel | FIR | Gujarat

Fir against hardik patel

hardik patel, FIR, Gujarat, patel, patel community, Umiya Campus, Sola police, Gujarat MLAs

FIR Against Hardik Patel A manager of a prominent educational and religious organisation of the Patel community today lodged a First Information Report against Hardik Patel, who has been leading an agitation for reservation, and his 100-odd supporters for trespass, rioting and assault.

హార్దిక్ పాటిల్ మీద ఎఫ్ఐఆర్ నమోదు

Posted: 09/04/2015 09:01 AM IST
Fir against hardik patel

గుజరాత్ లో ఉంటున్న బలమైన సామాజిక వర్గం పటేళ్లను ఓబీసీ కోటాలో చేర్చాలనే డిమాండ్ తో ఉద్యమించి రాత్రికి రాత్రి సెలబ్రెటీగా మారిన హార్దిక్ పాటిల్ మీద కేసు నమోదైంది. అక్రమంగా తమ క్యాంపస్‌లో ప్రవేశించి నినాదాలు చేశారని ఉమియా క్యాంపస్ మేనేజర్ మనుప్రసాద్ పటేల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు హార్దిక్ పటేల్‌పై ఐపీసీలోని 147, 427, 447 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.

గుజరాత్ లో ప్రారంభమైన ఓ ఉద్యమం.. తీవ్ర రూపం దాలుస్తోంది. పటేళ్లకు ఓబీసీలో చోటుకల్పించాలని డిమాండ్ చేస్తూ పటేళ్లు చేస్తున్న ఆందోళప మరోరూపం దాల్చనుంది.
గుజరాత్ అసెంబ్లీలో పటేల్ సామాజికవర్గ ఎమ్మెల్యేలతో పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ సమావేశం కానున్నారు. ఓబీసీ కోటాలో పటేళ్లకు రిజర్వేషన్ కల్పనపై వారి వైఖరేమిటో తెలుసుకుంటామన్నారు. రిజర్వేషన్ల కోసం జరుగుతున్న తమ ఆందోళనకు మద్దతు తెలుపుతారా? లేక పార్టీ వైఖరులకు కట్టుబడి ఉంటారా? అన్న విషయం వారిని అడిగి తెలుసుకుంటామని హార్దిక్ పటేల్ వెల్లడించారు. తనతోపాటు వందల మంది మద్దతుదారులు ఈ ప్రక్రియలో పాల్గొంటారని వివరించారు. 182 స్థానాలు గల అసెంబ్లీలో 35 మందికి పైగా పటేల్ సామాజిక వర్గ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

అయితే ఇప్పటికే తీవ్రమైన పటేళ్ల ఉద్యమం రాజకీయ మద్దతు కూడా కూడగట్టగలిగితే మాత్రం తీవ్ర పరిణామాలే చోటుచేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పటేళ్ల రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటానికి హా్ర్దిక్ పాటిల్ మరింత ఉదృతం చేశారని, ఇదే విధంగా రాజస్థాన్ లోని గుజ్జర్లతో కలిసి తమ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలని పటేల్ సామాజిక వర్గం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆందోళనలకు పిలుపునివ్వడంతో పాటు గుజరాత్ లో రాజకీయంగా కూడా అడుగులు వెయ్యాలని హార్దిక్ పాటిల్ ఆలోచిస్తున్నారు. అయితే ఈ రోజు ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత హార్దిక్ ఏదైనా సంచనల వార్త వెల్లడిస్తాడా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా అహ్మదాబాద్‌లో పాస్ నేతలు సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. చివరిక్షణాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసినందువల్లే ఆమోదించలేదని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హింకార్ సింగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  FIR  Gujarat  patel  patel community  Umiya Campus  Sola police  Gujarat MLAs  

Other Articles