Kapu corporation | AP | hardik patel

Hardik patel indirectly help to ap kapus

Kapu, Kapu corporation, AP, hardik patel, Gujarat, Hardik Patel on Reservation

Hardik Patel indirectly help to ap kapus. Gujarat Rising star, patels new hero hardik patel indirectly helps to get corporation for kapu in ap.

హార్దిక్ పటేల్ ఏపి కాపులకు పరోక్షసాయం

Posted: 09/03/2015 05:20 PM IST
Hardik patel indirectly help to ap kapus

కాపుల కష్టాలకు కాస్త ఉపశమనం కలగనుంది.. వెనకబాటుతనం నుండి కాసింత అభివృద్దికి బాటలు పడనున్నాయి. నిజానికి ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడినా కానీ సమాజంలో మాత్రం ఉన్నత వర్గాలుగా పేరుగాంచిన వారి కష్టాలు వర్ణానాతీతం. అందుకే పేరుగొప్ప.. ఊరుదిబ్బ అన్నట్లు తయారైంది కాపుల పరిస్థితి. అయితే పరిస్థితి మార్చడానికి అప్పుడప్పుడు కొన్ని ప్రయత్నాలు చేశారు. తమకు ఓబీసీ క్యాటగిరీలో చోటుకల్పించాలని.. తమను కూడా వెనుకబడిన తరగతుల కింద గుర్తించాలని ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. అందుకే ఢిల్లీ నుండి గల్లీ దాకా కాపులు కదిలారు. అయితే దీనికి అన్ని పార్టీలు కూడా మద్దతు పలికాయి. కానీ గింజ పడ్డాక గుంజ పట్టుకో అన్నట్లు.. అవసరం తీరిపోయాక రాజకీయ నాయకులు తమ అసలు స్వరూపాన్ని బయట పెట్టడం.. తిరిగి కాపులకు మొండి చేయి చూపించడం మామూలైపోయింది. అయితే ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న డిమాండ్ సంగతి ఏమో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తాజాగా కాపుల అభివృద్దికి పాటుపడేలా కొత్తగా కాపు కార్పోరేషన్ ను ప్రారంభించడానికి ప్రభుత్వం జీఓ జారీ చేసింది.

ఏపిలో కాపుల మీద హార్దిక్ పాటిల్ ప్రభావం..
గుజరాత్ లో జనాభాపకంగా అధిక సంఖ్యలో ఉన్న పటేళ్ల సామాజిక వర్గం కూడా కాపుల మాదిరిగానే అన్నింటా వెనుకబడింది. సమాజంలో మాత్రం పటేల్ వర్గానికి ఉన్నత వర్గంగా గుర్తింపు ఉంది. అది వారి వెనుకబాటుతనానికి కారణమైంది. అయితే వారి వెనకబాటుతనానికి కారణమైన ఓసీ క్యాటగిరీ నుండి తమను కూడా ఓబీసీ కింద చేర్చాలని డిమాండ్ చేస్తూ గుజరాత్ లో చేసిన ఉద్యమం దేశంలో సంచలనం సృష్టించింది. దేశ ప్రధాని దగ్గరి నుండి అందరూ కూడా హార్దిక్ పటేల్ గురించే చర్చిస్తున్నారు. కేవలం 22 సంవత్సరాల ఓ యువకుడు చేస్తున్న ఉద్యమం మహా ఉద్యమంగా మారింది.. గుజరాత్ మొత్తాన్ని బంద్ చేస్తూ.. దేశాన్ని తన వైపు దృష్టిసారించేలా చేసింది. అయితే తాజాగా తన ఉద్యమాన్ని కేవలం పటేళ్లకు మాత్రమే పరిమితం చెయ్యకుండా ఇతర ఉన్నత, వెనుకబడిన తరగతుల వారి మీద కూడా ప్రభావితం చేసింది.

గుజరాత్ లోని పటేళ్లతో పాటు, రాజస్థాన్ లోని గుజ్జర్లు, అలాగే అస్సాంలో, మధ్య ప్రదేశ్ లో ఉంటున్న వారిని కలుపుకొని ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉదృతం చేస్తామని హార్దిక్ పాటిల్ ప్రకటించారు. అయితే గుజరాత్ లో ప్రారంభమైన పటేళ్ల పోరాటం తెలుగు నాట ఉన్న కాపులకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. తాము ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్న ఓబీసీ క్యాటగిరీలో చేర్పు మీద కాపుల్లో చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాపులను ఓబీసీ జాబితాలో చేరుస్తామని, వారి అభివృద్దికి అన్ని రకాలుగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అదికారంలోకి వచ్చి ఇంతకాలమైనా కానీ ఎలాంటి అడుగు వెయ్యలేదు.

అయితే గతవారంలో జరిగిన గుజరాత్ పటేళ్ల ఉద్యమం కాపుల్లో కదిలిక తీసుకురావడంతో.. ఏపిలో అధికార పక్షానికి చమటలు పట్టాయి. అసలే టెక్నాలజీని విరవిగా వాడే చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుండి గల్లీ దాకా అన్ని విషయాలను ముందే పసిగట్టే అపర చాణిక్యుడు చంద్రబాబు నాయుడు ఏపిలో ముందు ముందు జరగబోయే ఉద్యమాన్ని ఊహించారు. అందుకే కాపులు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, తన ప్రభుత్వం పరువుపోక ముందే కాపుల కోసం ఏదైనా చెయ్యాలని యోచించారు. అందులో భాగమే తాజా కాపు కార్పోరేషన్. కాపులను ఓబీసీల్లో చేర్చే ఆలోచనకు పూర్తి కార్యరూపం ఇవ్వలేక ప్రస్తుతానికి కాపుల అభివృద్ది కోసం అంటూ కాపు కార్పోరేషన్ ను ప్రారంభించేందుకు జీఓ జారీ చేశారు. అయితే అక్కడెక్కడో గుజరాత్ లో హార్దిక్ పటేల్ ప్రారంభించిన పటేళ్ల ఉద్యమం ఎఫెక్ట్ ఏపిలో ఉన్న కాపుల మీద చూపించింది. అలా ఏపిలోని కాపులకు హార్దిక్ తెలియకుండానే మేలు చేశారు.

 

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kapu  Kapu corporation  AP  hardik patel  Gujarat  Hardik Patel on Reservation  

Other Articles