Kapu | AP | Chandrababu naidu | kapu corporation

Establishment of andhra pradesh state kapu welfare and development corporation

Kapu, AP, Chandrababu naidu, kapu corporation, Kapu people, kapu protest

Establishment of Andhra Pradesh State Kapu Welfare and Development Corporation. AP Govt decided to establish new corporation for Kapus.

కాపు కార్పోరేషన్ ప్రయో‘జనం’ ఎంత..?

Posted: 09/03/2015 01:33 PM IST
Establishment of andhra pradesh state kapu welfare and development corporation

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపుల అభివృద్దిని విస్మరిస్తుందని మరోమారు రూఢీ అయ్యింది. కాపుల అభివృద్ది కోసం తాజాగా ప్రకటించిన కాపు కార్పోరేషన్.. భవితవ్యంపై అదిలోనే నీలినీడలు కమ్ముకున్నాయి. కాపుల అభివృద్దికి దోహదపడుతుందని ప్రభుత్వం ప్రకటించిన కార్పోరేషన్.. దాని మనుగడకు ప్రకటించిన నిధులు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అధికారంలోని తెలుగుదేశం ప్రభుత్వం గుప్పెడు నిధులను విధిల్చి.. గొప్పలు మాత్రం చారెడు చెప్పుకుంటుందన్న విమర్శలు వినబడుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వచ్చిన రాష్ట్ర ఎన్నికలలోె.. తాము అధికారంలోకి వస్తే కాపులకు అది చేస్తాను.. ఇది చేస్తాను అంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. అధికారఫీఠాన్ని అధిరోహించిన 15 మాసాలకు అరకోర నిధులతో కాపుల కార్పోరేషన్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం కూడా విమర్శలకు తావిస్తోంది. ఐదు కోట్ల మంది ఆంధ్రులలో కోటి 20 లక్షల జనాబా వున్న కాపులకు ప్రభుత్వం విధిల్చుతున్న నిధులు మాత్రం కేవలం రూ. 100 కోట్లే కావడం ఇందుకు కారణం. ప్రభుత్వం ప్రకటించిన వంద కోట్ల రూపాయలు సగటున తీసుకుంటే ఒక్కో వ్యక్తికి తొంబై రూపాయలకు మించిన లాభమే చేకూరుతుంది.ఇది లాభం కాపులకు ఏ మేరకు ప్రయోజనకారిగా మారుతుందో చంద్రబాబుకే తెలియాలి?.

పన్నెండు రోజుల పాటు సాగిన గోదావరి మహా పుష్కరాలకు 2వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు సర్కార్.. ఎన్నికల వేళలో తమకు అండగా వున్న కాపులకు మాత్రం కనీసం చేసిందేమీ లేదు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుకు 15 మాసాలు తీసుకున్న సీఎం.. నిధులు మూరెడు.. ప్రచారం బారెడు అన్న చందంగా తన అసలు నైజాన్ని ప్రకటించాడని కాపు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాగానే అన్ని చేస్తామన్న బాబు.. 15 మాసాలు పూర్తి చేసుకున్నా.. కాపుల అభ్యున్నతికి తీసుకున్న చర్యలు రమారమి శూన్యమే.

ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాపు సంఘాల నేతలు డిమాండ్ చేయడం.. డెడ్ లైన్లు విధించడం.. ప్రభుత్వానికి సకహరించాలంటే తమ డిమాండ్లను పరిష్కరించాలని గోంతెత్తి నినదించినా చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఇక చివరాఖరికి రంగంలోకి దిగిన కాపు సంఘాల నేతలు.. చంద్రబాబుకు ఆయన ప్రభుత్వానికి క్రమంగా దూరంగా జరగడం ప్రారంభించారు. దీంతో కాపులు దూరమవుతున్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు.. కార్పోరేషన్ పేరుతో వారిని తన వైపుకు తిప్పుకునేందుకు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా 100 కోట్ల రూపాయల నిధులతో కాపు కార్పోరేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు జీవో జారీ చేశారు.


Also Read:  కాపుల జీవితాలను మార్చనున్న జిఓ

జిఓలోని ముఖ్యాంశాలు...

Click Here: FOR FULL DETAILS 

* కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులు సామాజికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వారు నిజానికి ఉన్నత వర్గాలుగా పేర్కొంటున్నా కానీ వెనుకబడిన తరగతుల వారిలాగానే ఉన్నారు. చాలా మంది కనీస భూమి కూడా లేకుండా జీవనం సాగిస్తున్నారు. నిజానికి వీరి వృత్తి వ్యవసాయమే అయినా కూడా చాలా మందికి భూమి లేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ సంపాదిస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

* అందుకు గాను వెనకుబడిన తరగతుల సంక్షేమ శాఖ డైరెక్టర్ కాపుల అభివృద్ది కోసం కొత్తగా కాపు కార్పోరేషన్ ఏర్పాటుకై రికమండ్ చేశారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్దికి కొత్తగా ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ పాటుపడాలని కోరారు. ఈ కులస్తులకు విద్యావకాశాలను పెంచడంతో పాటు వారి ఉపాధికి కూడా పాటుపడేలా కొత్తగా ఏర్పాటు చేసే కాపు కార్పోరేషన్ కృషి చేస్తుంది.

* ప్రభుత్వం కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తుల పేదరికం మీద అన్ని రకాలుగా సమాచారం సేకరించిన తర్వాత కొత్తగా వారి అభివృద్దికి కార్పోరేషన్ ను ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు జీఓలో పేర్కొన్నారు. కాపులకు అన్ని రకాలుగా అభివృద్ది వైపు నడిపించేందుకు, సహకారం అందించేందుకు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

*2015-16 బడ్జెట్ అంచనాల్లో కాపు వెల్ఫేర్ కోసం వంద కోట్లు కేటాయించింది ఏపి ప్రభుత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu  AP  Chandrababu naidu  kapu corporation  Kapu people  kapu protest  

Other Articles