PM Narendra Modi Concern About Controversies In India | OM Word Controversy | MS Subbalaxmi

Pm narendra modi speech about controversies india om word

narendra modi, narendra modi speech, narendra modi controversy, narendra modi updates, ms subbalakshmi, sri venkateswara subrabhatham, Om word, New Delhi, All india Radio Programmes

PM Narendra Modi Speech About Controversies India OM Word : PM Narendra Modi Concern About Controversies In India. He Says Even Controversies Are Creates When OM Word Use.

ప్రధాని మోదీ నోట.. ‘ఓం’ వివాదం మాట!

Posted: 09/01/2015 10:08 AM IST
Pm narendra modi speech about controversies india om word

దేశంలో ఒకప్పుడు ‘వివాదాలు’ కొన్ని సందర్భాల్లో మాత్రమే జరిగేవి. అంటే.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణులకు జనం ఏకమై వ్యతిరేక పోరాటం చేయడం, కుల రాజకీయాల కారణంగా పెద్ద మొత్తంలో దుమారం రేగడం, ఇంకా ఎన్నో ఘటనలు ఆయా సందర్భాల్లో మాత్రమే చోటు చేసుకునేవి. కానీ.. ఇప్పుడు ప్రతిఒక్క అంశంపై వివాదాలు జరుగుతున్నాయి. ఎక్కడో ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక చిన్న గొడవ జరిగితే.. అది చిలికి చిలికి జాతీయ వివాదంగా నిలిచిపోతోంది. ఆ తర్వాత అది రాజకీయ నాయకుల దృష్టికి వెళ్లడం, కేసులు నమోదు చేయడం, దానిపై విచారణలు జరిపించడం.. అబ్బో.. ఇటువంటి రాద్ధాంతాలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇటువంటి సంఘటనలు తరచూ జరగడం ఎంతో ఆవేదనకు గురి చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీలో ఆలిండియా రేడియో రూపొందించిన ‘రామ్ చరిత్ మానస్’ సీడీల ఆవిష్కరణ సందర్భంగా.. దేశంలో జరుగుతున్న వివాదాలపై ప్రధాని మోదీ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశంపైన వివాదం రేగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ‘ఓం’ అన్నా.. అది వివాదానికి దారి తీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ప్రతి చిన్న విషయంపైనా సిద్ధాంత రాద్ధాంతాలు రేగుతున్నాయని కలత చెందారు. ఈ వివాదాలను అరికట్టాలంటే ప్రతిఒక్కరూ మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం సందర్భంగానే ఆయన.. ప్రముఖ గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఆలపించిన ‘శ్రీవెంకటేశ్వర సుప్రభాతం’ దక్షిణాదిలో ఎంత ప్రజాదరణ పొందిందో, ఉత్తర భారతంలో రేడియోలో ప్రసారమయ్యే ‘రామ్ చరిత్ మానస్’కూ అంతే ఆదరణ లభిస్తోందని అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  all india radio programme  

Other Articles