TSPSC | Telangana | Jobs | Groups

Tspsc released the syllabus for the all notifications

TSPSC, Telangana, Jobs, Groups, Telangana Jobs, Govt Jobs

TSPSC released the syllabus for the all notifications. TSPSC chairman Ganta Chakrapani and others released the syllabus pattern for the job notification.

సర్కారీ కొలువుకు సెలబస్ వచ్చేసింది

Posted: 09/01/2015 09:33 AM IST
Tspsc released the syllabus for the all notifications

తెలంగాణలో త్వరలోనే కొలువుల జాతర అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు అట్టహాసంగా ప్రకటించారు. ఆ దిశగా టిఎస్ పిఎస్సి తొలి నోటిఫికేషన్ ను కూడా విడుదల చేసింది. అయితే నోటిఫికేషన్ల సంగతి ఎలా ఉన్నా కానీ అందుకు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం మారిన సెలబస్ మీద క్లారిటీ లేకుండా పోయింది. అయితే టిెస్ పిఎస్సీ చైర్మెన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలోని బృందం అన్ని రకాల నోటిఫికేషన్లకు సిలబస్ ను ఖరారు చేసింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ల మీద, వాటి సెలబస్ ల మీద టిఎస్ పిఎస్సీ పూర్తి స్థాయి స్పష్టత నిచ్చింది. తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగ పరీక్షల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్‌ను ఘంటా చక్రపాణి ఆవిష్క రించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర, ఆకాంక్షలను ప్రతిబింబించేలా సిలబస్‌ను రూపొందించారని కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.

తొంభై మంది అధ్యాపకులు, 32 మంది తెలంగాణ మేధావులు, పరిశోధకుల కృషి ఫలితంగా సిలబస్‌ రూపుదిద్దుకుందని, జులై 27 నుంచి ఆగస్టు 27 వరకు రాత్రింబవళ్లు వీరు కృషిచేశారని ప్రశంసించారు. గ్రూప్‌ 1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, గ్రూప్‌ 4, గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకు పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించామన్నారు. టిఎస్‌పిఎస్‌సి వెబ్‌సైట్‌లో సిలబస్‌ వివరాలను అందరికీ అందుబాటులో ఉంచామని, వీటి ఆధారంగా విద్యార్ధులు, యువత ముందస్తుగా సన్నద్ధం కావడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ నెల మొదటి వారంలొనే ప్రభుత్వంలోను, కార్పోరేషన్‌లలోను ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఫ్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి వెల్లడించారు. వ్యవసాయశాఖ, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌, జలమండలి, నీటిపారుదల శాఖలకు సంబంధించిన కొన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు.

గ్రూప్ -1 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ -2 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ -3 సిలబస్ కోసం క్లిక్ చేయండి
గ్రూప్ -4 సిలబస్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TSPSC  Telangana  Jobs  Groups  Telangana Jobs  Govt Jobs  

Other Articles