Flipkart Founder Punit Soni Says Sorry In Beautiful Girls Controversy | Richa Kaul Flipkart | Online Shopping Portals

Flipkart punit soni beautiful girls controversy richa kaul online shopping portals

flipkart controversy, punit soni twitter, richa kaul flipkart, flipkart beautiful girls, beautiful girls controversy, flipkart online portal, flipkart latest updates, flipkart shopping, social media, girls social media controversy

Flipkart Beautiful Girls Controversy Richa Kaul Online Shopping Portals : Flipkart Founder Punit Soni Says Sorry For Sending Beautiful Girls E-Mails To Women Which Gone Viral On Social Media.

‘ఫ్లిప్ కార్ట్’ను కాటేసిన ‘అందమైన యువతులు’?

Posted: 08/31/2015 03:46 PM IST
Flipkart punit soni beautiful girls controversy richa kaul online shopping portals

అమ్మాయిల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని వారి బారినపడిన ప్రతిఒక్క బాధితుడు చెబుతూనే వుంటాడు. వ్యక్తిగత విషయాల వరకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు.. వారి అందాల ప్రస్తావన వరకే చాలు. ఇద్దరి అమ్మాయిలు వున్నప్పుడు ఒకరు అందంగా వున్నారని, మరొకరు యావరేజ్ గా వున్నారని కాంప్లిమెంట్ ఇస్తే చాలు.. వారిరువురు సదరు వ్యక్తికి అందానికి నిజమైన డిఫినెషన్ అక్కడే విశ్లేషించి వివరిస్తారు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా.. ‘ఫ్లిప్ కార్ట్’ కాస్త ఓవర్ గా ప్రవర్తించింది. ఊరికే తన ఆన్ లైన్ బిజినెస్ చేసుకోకుండా.. అందమైన అమ్మాయిల ప్రస్తావనను తీసుకొచ్చి వారి ఆగ్రహానికి బలయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. కస్టమర్లను ఎట్రాక్ట్ చేసేందుకు ఆన్-లైన్ బిజినెస్ పోర్టల్ ‘ఫ్లిప్ కార్ట్’ సరికొత్త ప్రణాళికలను అవలంభిస్తుంటుంది. డిస్కౌంట్లు ప్రకటించడం, వినూత్న విధానాల్లో అడ్వర్టయిజ్ మెంట్లు ఇవ్వడం.. ఇంకా రకరకాల మార్గాలను అనుసరిస్తుంటుంది. ఆ తరహాలోనే మహిళా కస్టమర్లను ఆకర్షించేందుకు ఓ కొత్త ప్లాన్ వేసింది. అయితే.. అది మహిళలకు నచ్చకపోవడంతో.. ఆ ఆన్-లైన్ పోర్టల్ పై సామాజిక మాధ్యమాల్లో వాళ్లు నిరసనలు చేశారు. ఇంతకీ ఫ్లిప్ కార్ట్ చేసిందేమిటంటే.. ‘యువతులు అందంగా ఉంటే మరిన్ని విజయావకాశాలు లభిస్తాయని ఓ రీసెర్చ్ చెబుతోంది. యువతులు అందంగా కనిపిస్తే, వారివైపు చూస్తారు. వారు చెప్పేది వింటారు. అలా కనిపించే వారిలో నమ్మకం పెరుగుతుంది. ఇతరులను సైతం మోటివేట్ చేస్తారు’ అంటూ, మహిళలను అందంగా చూపే దుస్తులపై 20 శాతం అదనపు రాయితీలు ఇస్తామని మహిళా కస్టమర్లకు మెయిల్ పెట్టింది.

అంతే! ఆ వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని రిచా కౌల్ అనే ఫ్లిప్ కార్ట్ కస్టమర్ వ్యాఖ్యానించారు. ఆమెతోపాటు ఇంకా చాలామంది మహిళలు ఫ్లిప్ కార్ట్ పంపిన ఈ-మెయిల్ పై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నారు. ఈ విధంగా వస్తున్న నిరసనలను కట్టడి చేసేందుకు ఫ్లిప్ కార్ట్ వ్యవస్థాపకుడు పునీత్ సోనీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు చెప్పారు. ఆ ఈ-మెయిల్ తన దృష్టికి రాలేదని, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని మరో మెయిల్ పంపుతామని ఆయన తెలిపారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. ఏదేమైనా.. ‘అందమైన అమ్మాయిల’ ప్రస్తావనకు చివరికి ఫ్లిప్ కార్ట్ కూడా బలి కాక తప్పలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart controversy  punit soni  richa kaul flipkart  

Other Articles