YS Jagan | Chandrababu naidu | AP assembly

Channdrababu naidu slams ys jagan

YS Jagan, Chandrababu naidu, AP, assembly, special status, assembly sessions

Channdrababu naidu slams YS jagan. In the assembly sessions, chandrababu naidu counter to ysrcp leader ys Jagan.

ITEMVIDEOS: హత్యలు చెయ్యడం ఆ పార్టీకి అలవాటు

Posted: 08/31/2015 03:27 PM IST
Channdrababu naidu slams ys jagan

ఏపి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. చంద్రబాబు నాయుడు, జగన్ ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రత్యేక హోదా మీద, రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయిన వారి మీద జగన్ చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వం తరఫున దమ్మిడి ప్రయోజనం లేదని  జగన్ ఎద్దేవా చేశారు. జగన్ రాజమండ్రి ఘటన మీద స్పందిస్తు ప్రభుత్వం చేసిన హత్యలుగా వ్యాఖ్యానించడం అసెంబ్లీలో దుమారం రేపింది. టిడిపి నాయకుల, బిజెపి నేతల పొంతన లేని స్టేట్ మెంట్ ల కారణంగా చాలా మంది ప్రత్యేక హోదా రాదని భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. ఏపీజే అబ్దుల్ కలాంకు సంతాపంతో పాటుగా , పుష్కారాల్లో చనిపోయిన వారికి కూడా సంతాప తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా వైసీసీ దాన్ని ఖండించింది. అబ్దుల్ కలాంకు నివాళి అర్పించిన అసెంబ్లీ. పుష్కరాల మృతులకు సంతాప తీర్మానం మీద తీవ్ర దుమారం రేగింది.

ప్రభుత్వం చేసిన హత్యలుగా వైసీపీ అసెంబ్లీలో అభివర్ణించింది. ప్రభుత్వం నిర్లక్షం కారణంగానే అంత మంది అమాయకులు చనిపోయినట్లు వైసీపీ నాయకులు చంద్రబాబు మీద, ఏపి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు గుప్పించారు. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ మీద, వైసీపీ వైఖరి మీద అంతెత్తున లేచారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు యూపీఏ ప్రభుత్వం రాష్ర్టాన్ని విభజిస్తున్నప్పుడు ఎంపీగా ఉన్న జగన్మోహ్న్ రెడ్డి ఏం చేశారని...ఎక్కడ దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంటు సమావేశపు హాలు తలుపులు మూసేసి మరీ రాష్ర్ట విభజన చేస్తుంటే జగన్ పార్లమెంటులో కూర్చుని ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. హత్యలు చెయ్యడం వైసీపీ పార్టీ లక్షణమని. ప్రజలను అన్ని రకాలుగా రక్షించడం మా పార్టీ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  Chandrababu naidu  AP  assembly  special status  assembly sessions  

Other Articles