I would still choose my country over any relative: Saif Ali Khan

Saif ali khan ponders his loyalties as new spy film phantom is banned in pakistan

filthy propaganda on Hafiz Saeed, Hafiz Saeed outfit, Pakistan, bans Bollywood movie Phantom, director Kabir Khan, anti-terrorism, anti-Pakistani, 26/11 attacks,Hafiz Muhammad Saeed, Katrina Kaif, Pakistan, Pakistan court, Mumbai attack mastermind Hafiz Saeed, saif ali khan, Salman Khan

While Phantom has been banned in Pakistan on JuD chief Hafiz Saeed’s plea, Saif maintains that the film is not against any religion.

దేశభక్తిని చాటుకున్న సైఫ్ అలీఖాన్.. పనిలో పనిగా సినిమా ప్రమోషన్..

Posted: 08/28/2015 08:31 PM IST
Saif ali khan ponders his loyalties as new spy film phantom is banned in pakistan

జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయ్యద్... ముంబై టెర్రర్ వెనుక అసలు సూత్రధారి అని ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సైఫ్ అలీఖాన్ అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యాలతో ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియాకు షాక్ ఇచ్చాడు.. 2012 లో ఐఎస్ఐ చీఫ్గా పనిచేసిన మేజర్ జనరల్ అలీఖాన్ తన అంకుల్ అవుతారని, చిన్నతనంలో ఆయన పిల్లలతో కలిసి తాను ఆడుకున్న రోజులు గుర్తు చేసుకున్నని తన ఫ్యామిలీకి సంబందించి కూడా కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశాడు సైఫ్. అయితే
దేశం కన్నా తనకు ఫ్యామిలీ రిలేషన్స్ ఎక్కువ కాదని స్పష్టం చేశాడు.

తాను హీరోగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఫాంతమ్'  సినిమా పై పాకిస్తాన్లో బ్యాన్ విధించటంతో సైఫ్ ఈ వ్యాఖ్యాలు చేశాడు.  సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సైప్.. పాకిస్తాన్ సినిమాను బ్యాన్ చేయడంతో ఆ వెనువెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయమై స్పందించాడు సైఫ్. తన దేశానికి, భారతమాతకు హాని చేసేవారు తన కుటుంబసభ్యులైన వారికి మద్ధతు తెలిపే ప్రసక్తే లేదంటూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం పాక్ విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న షేర్యార్ ఖాన్ కూడా తన బంధు వర్గం వాడే అన్న సైఫ్,  భారత ప్రభుత్వంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయిని తెలిపారు. ఏది ఏమైనా సినిమా ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ కోసం కాంట్రవర్షియల్ కామెంట్స్ నే ఆశ్రయిస్తారన్న మాటని సైఫ్ మరోసారి నిజం చేశారని పలువురు విమర్శకులు అంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : saif ali khan  phantom  kabir khan  pakistan  isi  terrorists  hafeez sayeed  

Other Articles