land aquisition in AP capital amaravathi withdrawn by government

Ap government withdraws land acquisiton in capital area

AP government withdraws land acquisiton in capital area, pawan thanks AP government, pawan thanks AP government for withdrawing land aquisition, ap capital city, amaravathi, land acquisition, pawan kalyan, janasena, power star pawan kalyan

Following continuous warnigs to government for protest from janasena president pawan kalyan, AP government bounces back and withdraws land aquisition in capital area.

ఫలించిన ఫవన్ కల్యాన్ వ్యూహం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం..

Posted: 08/28/2015 08:25 PM IST
Ap government withdraws land acquisiton in capital area

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంత రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే తాను దీక్ష బూనుతానని ముందునుంచి చెబుతూవస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాటలను ప్రభుత్వం అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సినిమీ రంగంలో నిత్యం బిజీగా వుంటే నటులు పార్టీలు పెట్టి.. పుల్ టైమ్ గా ప్రజలకు అందుబాటులో వుంేటనే రాణిస్తారని, అంతేకాని అప్పుడప్పుడు వస్తే పెద్దగా పట్టించుకోరన్ని ప్రభుత్వ అంచనాలు కూడా తారుమారయ్యాయి. ఆయన అండ లేకుంటే అధికారంలో కూర్చోవడం కూడా ప్రశ్నార్థకంగా మరిందని తెలిసికూడా ఆయన మాటలను తొలినుంచి సర్కారు లక్ష్యపెట్టలేదు.

కదనరంగంలోకి దిగిన పవన్ కల్యాన్ ను చూసిన ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తన వారిని రక్షించేందుకు యుద్దరంగంలోకి దిగని చత్రపతిలా పవన్ ప్రభుత్వానికి కనింపిచారు. పెద్దఎత్తున సభ వేదికకు వచ్చిన అక్కడి రైతులను చూసి.. వారు చెప్పిన విషయాలను ఆయన విన్న విధానం.. మధ్యలో పవన్ పై గుర్తు తెలియని అగంతకుడు రాయి విసిరినా.. ఆయన స్పందించిన వైనం.. చిట్టచివరకు ఎలాంటి చౌకబారు విమర్శలు లేకుండా క్లుప్తంగా.. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి చెప్పాశాడు. ఎలాంటి ఆరోపణలు చేయలేదు. తాను లేకుండా ప్రభుత్వంలో టీడీపీ ఎలా వచ్చేదని ప్రశ్నించలేదు.

దీంతో పవన్ కల్యాన్ ను వెనకేసుకొచ్చే చర్యలను అధినేత చంద్రబాబు భుజాన వేసుకున్నారు. పవన్ పై ఎవరూ విమర్శలు చేయకూడదంటూ.. ఆవసరమైతే రాజధాని భూ సమీకరణ విషయంలో అయనతో మాట్లాడుతామంటూ ప్రకటించారు. ఇలా ప్రకటించి 24 గంటలు కూడా గడవకముందే.. భూసేకరణ తమ ప్రభుత్వ అభిమతం కాదంటూ మంత్రి నారాయణ ఇటీవల జారీ చేసిన భూ సేకరణ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకున్నారు. ల్యాండ్ పూలింగే తమ ప్రభుత్వ అభిమతమని  స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే భూసేకరణకు నోటీఫికేషన్ జారీ చేశామన్నారు. పవన్‌కల్యాణ్ చెప్పినట్లు రైతులకు నచ్చచెప్పి భూసేకరణ చేస్తామని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : ap capital city  amaravathi  land acquisition  pawan kalyan  janasena  

Other Articles