An Engineer Student Named Harindam Debnath Killed A Woman Doctor For IPhone In Chennai | Crime News

Engineer student harindam debnath killed woman doctor for iphone

I phone Crime news, I phone murders, harindam debnath, engineer student harindam debnath, student killed doctor, student murders, man killd woman for iphone, i phone mobiles, i phone incidents

Engineer Student Harindam Debnath Killed Woman Doctor For IPhone : An Engineer Student Named Harindam Debnath Killed A Woman Doctor For IPhone. This Incident Took Place In Chennai.

‘ఐ-ఫోన్’ కోసం మహిళా డాక్టర్ ని చంపిన స్టూడెంట్

Posted: 08/24/2015 10:25 AM IST
Engineer student harindam debnath killed woman doctor for iphone

మొబైల్ ఫోన్లలో ‘ఐ-ఫోన్’కు వున్న ప్రభంజనం మరొక దానికి లేదన్న విషయం అందరికీ తెలిసిందే! ఆ మొబైల్ సిరీస్ కి సంబంధించి ఏదైనా కొత్తది విడుదలైతే చాలు.. దానిని కొనుగోలు చేసేందుకు జనాలు పడిగాపులు కాస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా దీనికి ఫాలోయింగ్ భారీ స్థాయిలోనే వుంది. ఇక ఇండియన్ మార్కెట్ లోకి ఈ ఫోన్ ఆలస్యంగా రావడమే కాకుండా చాలా విలువైంది కూడా. అయినప్పటికీ దీనిని ఎలాగైనా కొనాలనే పంథంతో కొందరు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు. ఇంట్లో కుటుంబసభ్యులకు తెలియకుండా డబ్బులు దొంగతనం చేయడం, వేరే వారి దగ్గరి నుంచి కొట్టేయడం లాంటివి చేస్తుంటారు. కానీ.. ఓ విద్యార్థి మాత్రం ఈ ఫోన్ పొందేందుకు ఓ మహిళా డాక్టర్ ని అత్యంత దారుణంగా హతమార్చాడు. చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెరంబలూరు జిల్లా, తురైమంగళం బాలాజీ నగర్‌కు చెందిన శేషు భార్య సత్య (32) మహిళా డాక్టర్. ఎంఎస్ విద్యనభ్యసించేందుకు ఆమె మూడు నెలల క్రితం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ వైద్య కళాశాలలో చేరింది. సత్ కీల్పాక్కం టైలర్స్ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌లో గది తీసుకుని వుంటోంది. ఆమెతోపాటు వైద్య కళాశాలలో ఎండీ చదివే సంగీత ఉంటోంది. అదే అపార్ట్ మెంటులోని మొదటి అంతస్తులో త్రిపుర రాష్ట్రం అగర్తలకు చెందిన ఓ డాక్టర్, అతని సోదరుడు ఇంజినీరింగ్ విద్యార్థి హరిందమ్ దేబ్‌నాథ్‌లు వున్నారు. అంతా సవ్యంగా కొనసాగుతున్న నేపథ్యంలో.. సత్య గత 20వ తేదీన హత్యకు గురైంది. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన సంగీత.. సత్య హత్యకు గురైన విషయాన్ని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సంఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా అనేక మంది వద్ద విచారణ జరిపారు.

ఈ విచారణలో భాగంగా మొదటి అంతస్తులో వుంటున్న విద్యార్థి హరిందమ్ దేబ్‌నాథ్ వేలిముద్రలను సేకరించి చూడగా.. సత్య గదిలో నమోదయిన వేలిముద్రలు సరిపోయాయి. దాంతో అతడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో పోలీసులు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే అతగాడు చెప్పిన విషయాలు పోలీసులతోపాటు అందరినీ ఆశ్చర్యపరిచాయి. సత్య వద్ద వున్న రూ.80 వేల విలువ చేసే ఆపిల్ ఫోన్ చేజిక్కించుకోవడం కోసమే హత్య చేసినట్లుగా తెలిపాడు. అంతకుముందు తాను ఆ ఫోన్ ను చోరీ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశానని, అయితే వీలుపడలేదన్నాడు. చివరగా.. 20వ తేదీన సత్య రాత్రి పనులు ముగించుకుని నిద్రపోయిందని, ఆ సమయంలో తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించి సెల్‌ఫోన్ చోరీ చేశానని చెప్పాడు. అయితే అదే సమయంలో సత్య హఠాత్తుగా మేల్కొని సెల్‌ఫోన్ కోసం పెనుగులాడిందన్నాడు.

అయినప్పటికీ సెల్‌ఫోన్ లాక్కుని బయటికి వచ్చేందుకు ప్రయత్నించానని, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న భయంతో అక్కడే వున్న కాపర్ వైర్‌తో సత్య గొంతు బిగించినట్లు తెలిపాడు. తర్వాత వంటింట్లో వున్న కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశానన్నాడు. అక్కడి నుంచి టాయ్‌లెట్‌లోకి వెళ్లి రక్తపు మడుగులు కడుక్కున్నానని, తర్వాత మోటార్ సైకిల్ తీసుకుని వెళుతుండగా పోలీసులకు తాను పట్టుబడినట్లు తెలిపాడు. అతని వాంగ్మూలాన్ని విన్న అవాక్కైన పోలీసులు.. అతనిని కస్టడీకి తీసుకెళ్లారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : i phone crime news  student killed doctors  Murder Cases  

Other Articles