PawanKalyan | Janasena | Jagan

Jagan also following pawankalyan strategy

PawanKalyan, Janasena, Jagan, AP, capital, Land, YS Jagan

Jagan also following PawanKalyan strategy. jagan also want to go capital city villages in ap. Janasena Party leader PawanKalyan went to there twice.

పవన్ కు ఫిదా అయిన జగన్..

Posted: 08/24/2015 10:00 AM IST
Jagan also following pawankalyan strategy

పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఒకరిని చూసి మరొకరు కాపీ కొడుతున్నారు. రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను చూసి అందరూ అవాక్కయ్యారు. అయితే అదే అభిమానం తమ మీద కూడా చూపిస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ తాజాగా మరో నేత కూడా అక్కడికి పర్యటనకు వెళుతున్నారు. అభిమానం అనేది గుండె లోతుల్లోంచి రావాలె కానీ పక్కవాడిని చూస్తే మాత్రం ఎలా వస్తుంది చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ తన పర్యటనలతో, ఓదార్పు యాత్రలతో బోర్ కొట్టించిన జగన్ తాజాగా పవన్ బాటలో నడవాలని డిసైడ్ అయ్యారు. రాజ‌ధాని కోసం రైతుల అనుమ‌తి లేకుండా  భూములు సేక‌రించ‌డాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జగన్‌ సీఆర్‌డీఏ పరిధిలో ధర్నాకు రెఢీ అయ్యారు. మరోవైపు... రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాటం లేదని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ నెల 25, 26న వరుస ధర్నాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది.

అవనిగడ్డనియోజకవర్గంలోని కొత్త మాజేరులో విషజ్వరాల బారినపడిన ప్రజలను జగన్‌ ఈనెల 4న పరామర్శించారు. వారంరోజుల్లో సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. అయితే.. 20రోజులైనా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 25న మచిలీపట్నం కలెక్టరేట్‌ ఎదట ధర్నా చేయాలని నిర్ణయించారు. రాజధాని కోసం భూసేక‌ర‌ణ‌పై జ‌గన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద‌ల భూముల‌ను బ‌ల‌వంతంగా లాక్కోవ‌డం తప్పుబట్టారాయన. రైతులకు న్యాయం చేసేందుకు వైసీపీ చివరి వరకు పోరాడుతుందని భరోసా ఇస్తోంది వైసీపీ.ఇప్పటికే  సేకరించిన భూమి రాజధాని నిర్మాణానికి సరిపోతుందని తెలిపింది వైసీపీ. ఇంకా అవసరమైతే... ప్రభుత్వ భూములను ఉపయోగించుకోవాలని సూచించింది. 33 వేల ఎక‌రాలు సమీకరించిన ప్రభుత్వం... ఇప్పుడు భూసేకరణకు వెళ్లటం సరికాదంటోంది వైసీపీ.  రైతులకు అండగా సమీక్షలు, పాదయాత్రలు చేసిన వైసీపీ మ‌రోసారి ప్రజల ప‌క్షాన నిలిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే  ప‌లుమార్లు తుళ్లూరు. మంగ‌ళ‌గిరి, ఉండ‌వ‌ల్లి, పెనుమాక‌, కుర‌గ‌ల్లు, నిడ‌మ‌ర్రులో జ‌గ‌న్‌ పర్యటించి రైతులకు అండ‌గా నిలబడ్డారు. ఇప్పుడు ధర్నా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది వైసీపీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PawanKalyan  Janasena  Jagan  AP  capital  Land  YS Jagan  

Other Articles