Telangana | Liquior | Cheap liquior

Telangana govt trying to bring new liquior policy for avail cheap liquior

Telangana, Liquior, Cheap liquior, KCR, Liquior policy, Telangana liquior policy

Telangana govt trying to bring new liquior policy for avail cheap liquior. Telangana govt focusing on supply more and cheap liquior to telangana people.

తెలంగాణ మద్యం తాగరా.. ఊగరా

Posted: 08/24/2015 08:56 AM IST
Telangana govt trying to bring new liquior policy for avail cheap liquior

మద్యం ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చేందుకు రాష్ట్రప్రభుత్వం సీరియస్‌గానే చర్యలు తీసుకుంటున్నది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో రాకపోయినా అక్టోబర్‌ నుండి అమలు చేయబోయే నూతన పాలసీ ద్వారా ఆదాయ మార్గాలను పరిశీలించేందుకు చర్యలు మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించింది. దీంతో మద్యం పాలసీని రూపొందించేందుకు నెలరోజులుగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గుడంబా తాగి మనుషులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కాబట్టి, అటువంటి వారికోసం చీప్‌ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దొంగచాటుగా తాగేవారు ఇకనుంచి ధైర్యంగా తాగమని సర్కారు పరోక్ష సంకేతాలు పంపుతోంది. చీప్‌లిక్కర్‌ కోసం ప్రత్యేక షాపులే కాదు గల్లీ గల్లీల్లో, కిరాణా షాపుల్లో సైతం అందుబాటులో ఉంచేందుకు ఆలోచనలు చేస్తోంది. పేదలకు తక్కువ ఖరీదులో చీప్‌ లిక్కర్‌ను ఇస్తామని, గుడంబాను తాగి ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. 12 వేల కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్‌ అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చీప్‌ లిక్కర్‌ తయారు చేసే చీప్‌ లిక్కర్‌ డిస్టలరీ సంఖ్యను పెంచాలన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 17 డిస్టిలరీలు మద్యం ఉత్పత్తి చేస్తుండగా వీటిలో నాలుగు డిస్టిలరీలు కేవలం చీప్‌ లిక్కర్‌ను మాత్రమే తయారు చేయాల్సింటుంది. ప్రస్తుతం ఉన్న చీప్‌ లిక్కర్‌ ప్రవేశపెడితే మరింత మద్యం తయారు చేయాలంటే ఈ నాలుగు డిస్టిలరీలు సరిపోవన్నది అధికారుల వాదన. దీంతో మరో నాలుగు కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేందుకు సర్కార్‌ ఆలోచన చేస్తోంది. నాలుగు కంపెనీలు ఇప్పటికే నెలకు లక్షా నలభైవేల కేసులు చొప్పున ఈ చీప్‌లిక్కర్‌ను తయారు చేస్తున్నాయి. నెలకు రెండున్నర లక్షల కేసుల మద్యాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నది. అయితే చవకగా కల్లు, గుడుంబా అందుబాటులో ఉండటంతో చీప్‌ లిక్కర్‌కు అంతగా డిమాండ్‌ లేదు. కానీ తర్వాత తర్వాత మాత్రం ఉత్పత్తి పెరిగింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న మద్యం విధానం రాష్ట్రంలో తాగుబోతులకు ఎంతో ఎంకరేజ్ చెయ్యనుంది. చీప్ లిక్కర్ ఎందుకు చీప్ గానే మంచి మందు  తాగు అంటూ ప్రభుత్వం చేస్తున్న సహకారానికి అందరూ అవాక్కవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Liquior  Cheap liquior  KCR  Liquior policy  Telangana liquior policy  

Other Articles