U Mumba | Pro Kabaddi | Banglore | title

U mumba edge out bengaluru bulls to lift pro kabaddi title

U Mumba, Pro Kabaddi, Banglore, Bengaluru Bulls, Pro Kabaddi title, Kabaddi

U Mumba edge out Bengaluru Bulls to lift Pro Kabaddi title U Mumba overcame a fighting Bengaluru Bulls 36-30 in a thrilling summit clash to lift the second Pro Kabaddi crown at a packed NSCI Stadium.

ప్రొకబడ్డి విజేత యు ముంబ.. బెంగళూర్ పై ఘన విజయం

Posted: 08/24/2015 08:36 AM IST
U mumba edge out bengaluru bulls to lift pro kabaddi title

ప్రొకబడ్డీ రెండో సీజన్‌లో యు ముంబ జట్టు విజేతగా నిలిచింది. 14 లీగ్‌ మ్యాచ్‌లలో 12 విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన ముంబై జట్టు ఫైనల్లో కూడా అదేజోరును కొనసాగించింది. బెంగళూరుతో నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్లో ఒత్తిడిని జయించి 36-30 తేడాతో విజేతగా నిలిచిందిగతేడాది చేజార్చుకున్న ట్రోఫీని ఈసారి ఒడిసిపట్టుకుంది. దీటైన రైడింగ్‌కు పటిష్ఠ డిఫెన్స్ తోడైన వేళ ముంబై జట్టు 36-30 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్‌పై అద్భుత విజయం సాధించింది. మరోవైపు ఫైనల్ చేరడంలో విఫలమైన తెలుగు టైటాన్స్ జట్టు చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకుంది. హోరాహోరీ: అనుభవజ్ఞుడైన కెప్టెన్ అనూప్‌కుమార్ సారథ్యంలో సొంత ప్రేక్షకుల మధ్య బరిలోకి దిగిన ముంబై మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన మ్యాచ్‌లో ఆధిక్యం ఇరు జట్ల మధ్య దోబూచులాడుకుంటూ వచ్చింది. షబ్బీర్ బాపు(9పాయింట్లు), కెప్టెన్ అనూప్‌కుమార్(6)ల రైడింగ్‌తో తొలి అర్ధభాగం ముగిసేసరికి ముంబై 16-8తో ఆధిక్యంలో నిలిచింది.

అయితే సెకండాఫ్ ఆట 33వ నిమిషంలో బెంగళూరు స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ అద్భుత రైడింగ్‌తో ముంబైని ఆలౌట్ చేసి ఐదు పాయింట్లు కొల్లగొట్టాడు. దీంతో ఇరుజట్ల స్కోరు 23-23తో సమమైంది. అయితే షబ్బీర్‌బాపు రైడింగ్‌లో మూడు పాయింట్లతో ముంబై ఒక్కసారిగా 29-24తో ముందుకెళ్లింది. ఈ దశలో బెంగళూరు కెప్టెన్ మంజీత్‌చిల్లార్ రెండు పాయింట్లు సాధించి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 25-30కు తగ్గించాడు. ఇక మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా రైడింగ్‌కొచ్చిన కెప్టెన్ అనూప్ బెంగళూరును ఆ లౌట్ చేసి మూడు కీలకపాయింట్లు సాధించడంతో ముంబైకు చిరస్మరణీయ విజయం దక్కింది. అంత కుముందు మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34-26 తేడాతో పాట్నా పైరేట్స్‌పై ఘనవిజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U Mumba  Pro Kabaddi  Banglore  Bengaluru Bulls  Pro Kabaddi title  Kabaddi  

Other Articles