Land | Amaravati | Chandrababu | Pawan Kalyan

Ap govt issue orders to acquire land for new capital amaravati

Land, Amaravati, Chandrababu, Pawan Kalyan, Ap Capital, acquisition of land

AP Govt Issue orders to acquire land for new capital amaravati. Pawan Kalyan oppse the ap govt decision. AP govt already have thirty three thousand land but need three thousand more land.

రాజధాని గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్

Posted: 08/21/2015 08:18 AM IST
Ap govt issue orders to acquire land for new capital amaravati

ఏపి రాజధాని అమరావతి కోసం కావాల్సిన భూమిని సేకరించేందుకు ఏపి సర్కార్ సిద్దమవుతోంది. గతంలో ల్యాండ్ పూలింగ్ కు రైతులకు అవకాశం ఇచ్చిన ఏపి సర్కార్ అందులో భూములు ఇవ్వని రైతుల నుండి ఎలాగైనా సరే భూములను తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏపి రాజధాని అమరావతికి మరో మూడు వేల ఎకరాల స్థలం అవసరం. కాగా ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. మాటల తూటాల మధ్యనే ఇవాళ్టి నుంచి భూసేకరణకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం 26మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌లను నియమిస్తూ ప్రత్యేక అధికారులను కట్టబెట్టింది ప్రభుత్వం.. మరోవైపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలుస్తానని పవన్‌ స్పష్టం చేశాడు.. దీంతో ఈ రభస పొలిటికల్‌గా ఏ టర్న్‌ తీసుకుంటుదన్నది ఆసక్తికరంగా మారింది..

ఇప్పటికే 33 వేల ఎకరాల సమీకరణ పూర్తైంది.. 3 వేల ఎకరాల దగ్గర పీటముడి పడింది.. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు సర్కార్‌కు ఈ పరిణామం ఇబ్బందిగా మారింది.. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారానే 90 శాతం మంది రైతులతో ఒప్పందం చేసుకుంది సర్కార్‌.. ఉండవల్లి, పెనుమాక, బేతపూడి గ్రామాలతో పాటు మరికొన్ని గ్రామాల రైతులు మాత్రం తమ భూములు ఇచ్చేది లేదన్నారు.. ఏడాదికి నాలుగు పంటలు పండే భూములను వదులుకునేది లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వం ఏ స్థాయిలో సంప్రదింపులు జరిపినా రైతులు వెనక్కితగ్గలేదు.. దీంతో ఇవాళ్టి నుంచి భూసేకరణ చట్టం అమలుకు సిద్ధమైంది ప్రభుత్వం..

భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన ప్రభుత్వం 26 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌లను నియమించింది.. భూ సేకరణకు ప్రత్యేక అధికారాలను కట్టబెడ్తూ జీఓ 304ను విడుదల చేశారు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి.. ఇదిలా ఉంటే భూసేకరణ నోటిఫికేషన్‌ను వ్యతిరేకిస్తూ తాడేపల్లి మండలం ఉండవల్లి రైతులు సీఆర్డీఏ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. భూ సేకరణను వ్యతిరేకిస్తున్న రైతులకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అండగా నిలిచారు.. భూసేకరణ చేపట్టొద్దని ట్విట్టర్‌ వేదికగా ఇప్పటి వరకు ఏపీ సర్కార్‌ను రిక్వెస్ట్‌ చేస్తూ వచ్చారు పవన్‌.. అంతేకాదు త్వరలోనే భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను కలిసేందుకు కూడా ఆయన ప్లాన్‌ చేసుకుంటున్నారు.. ఐనా ప్రభుత్వం మాత్రం భూసేకరణకు సిద్ధమైపోయింది.. మరి భూసేకరణ చట్టం ద్వారా భూములను రైతుల నుండి స్వాధీనపరుచుకోవాలని చూస్తున్న ఏపి సర్కార్ ప్రయత్నం ఫలిస్తుందో లేదా ప్లాన్ రివర్స్ అవుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Land  Amaravati  Chandrababu  Pawan Kalyan  Ap Capital  acquisition of land  

Other Articles