High court | judicature at hyderabad | DEO | Telangana

High court of judicature at hyderabad fired on education officials

High court, judicature at hyderabad, DEO, Telangana, Mahabubgar, Govt School

High court of judicature at hyderabad fired on education officials. High court order to handover full datails of techers who are working in govt schools at Mahabubngar.

మీ పిల్లలు కూడా సర్కారీ స్కూళ్లకు వెళ్లాలా..?

Posted: 08/21/2015 08:16 AM IST
High court of judicature at hyderabad fired on education officials

మీ పిల్లలు కూడా ప్రభుత్వం పాఠశాల్లో చదవాల్సి వస్తుంది. అలాగని ఆదేశాలు జారీ చేస్తామని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంతకీ విషయం ఏంటి అంటే మహబూబ్ నగర్ జిల్లా అమరచింతలో పాఠశాలలకు ఉపాధ్యాయులు రావడం లేదని విద్యార్థులు లేఖలు రాశారు. దానిని సుమోటోగా తీసుకున్న హైకోర్ట్ విచారణ ప్రారంభించింది.  విద్యాశాఖ కమిషనర్ తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తారా? అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలంటూ అలహాబాద్ హైకోర్టు మాదిరిగా ఆదేశాలు జారీచేయాలా? అని ప్రశ్నలు గుప్పించింది. విద్యార్థుల సమస్యలు తీర్చకుంటే, విద్యాశాఖ అధికారుల తీరు మారకుంటే.. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతకు బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని మేమూ ఆదేశాలు జారీచేయాల్సివస్తుంది అని  ధర్మాసనం హెచ్చరించింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, వాటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యలతో కూడిన వివరాలను తమకు పది రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. తమకు లేఖలు రాసిన విద్యార్థుల పాఠశాలల అటెండెన్స్ రిజిస్ట్రర్లు సైతం తమకు సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది.పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరంటూ మహబూబ్‌నగర్ జిల్లా రెండు మండలాలకు చెందిన ఏడు పాఠశాలల విద్యార్థులు రాసిన లేఖల్లో వాస్తవాలు ఉన్నాయని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఏ సంజీవకుమార్ హైకోర్టుకు తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీర్చడానికి ఇప్పటికే ప్రభుత్వం చర్యలను చేపట్టిందని, కొందరు టీచర్లను అక్కడికి బదిలీ చేసిందని తెలిపారు. టీచర్ల సంఖ్యపై విద్యార్థుల లేఖల్లో రాసిందానికి, ఈ వివరాలకు తేడాలున్నాయని పేర్కొంది. ఆ ఏడు పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల హాజరుపట్టికలను పదిరోజుల్లోగా తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాకమిషనర్ కోర్టుకు హాజరైన విషయం తెలుసుకున్న ధర్మాసనం..ఆయన తన పిల్లలను ఇలాంటి పాఠశాలల్లోనే చదివిస్తారా? అని ప్రశ్నించింది. ఉన్నతస్థాయి అధికారిని సస్పెండ్ చేస్తే కానీ విద్యార్థ్ధుల సమస్యలు మీకు అర్థం కావని వ్యాఖ్యానించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

ఈ మధ్యే అలహాబాద్ హైకోర్ట్ కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా మారిందని.. ఎవరూ వాటిని పట్టించుకోవడం లేదని హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పిల్లలు కూడా స్థానిక ప్రాధమిక పాఠశాల్లోనే చదవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దాంతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అలహాబాద్ కోర్ట్ తీర్పును సగటు భారతీయుడు ఎప్పటి నుండో కోరుకుటంన్నారు. నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ అది జరగడం లేదు. ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల మీద చూపుతున్న నిర్లక్షం, అధికారుల అలసత్వం కారణంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దేశంలో ఉన్నతమైన న్యాయవ్యవస్థ ఆదేశాలు జారీ చేస్తే కానీ పరిస్థితి మెరుగుపడేలా లేదు మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  judicature at hyderabad  DEO  Telangana  Mahabubgar  Govt School  

Other Articles