Domestic helps may get Rs 9,000 per month as salary

Domestic helpers to get minimum of rs 9 thousand salary per month

social seurity, working humans, 9 thousand pay, minimum wage, cabinet, Domestic helpers, maids, salary, nation

Hiring a full-time domestic help may soon be a costly affair, as they will have to be paid a minimum salary of Rs 9,000 per month, compulsory paid leave of 15 days annually and maternity leave for women.

ఇంటి పనులు చేసేందుకు మనుషులు కావాలా..? షరతులకు సమ్మతిస్తారా..?

Posted: 08/17/2015 04:42 PM IST
Domestic helpers to get minimum of rs 9 thousand salary per month

ఇళ్లలో పనిచేసేందుకు ఫుల్ టైం పనిమనుషులు కావాలా..? అయితే మీ ఆదాయం ఎంత..? లేదా మీ సంపాదన ఎంత..? ఈ ప్రశ్నలతో మీకెం పని, అనుకుంటున్నారు కదూ.. కానీ ఇక మీదట మీ ఇళ్లలో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు పనిమనుషులు కావాలంటే మాత్రం మీరు ఉన్నతాదాయ వర్గం వారై వుండాలి. లేదా మీ సంపాదన నెలకు లక్ష రూపాయల చేరువలో వుండాలి. ఎందుకంటారా..? ఇళ్లలో పనిచేసే పనిమనుషుల సామాజిక భద్రత కోసం కేంద్రం జాతీయ విధానాన్ని రూపొందించేందుకు కసరత్తుచేస్తోంది.

ఇందుకోసం ఫుల్‌టైమ్ పనిమనుషులకు నెలకు కనీసం 9వేల రూపాయల జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించనుంది. అంతేకాదు జీతంతో పాటుగా ఏడాదికి 15 చెల్లింపు సెలవులను, అదనంగా ప్రసూతి సెలవులను ఇచ్చేలా కొత్త విధానాన్ని తయారుచేస్తోంది. వారి ప్రయోజనాలను కాపాడుతూ, సామాజిక భద్రతను, లైంగిక వేధింపుల నుంచి రక్షణ, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేలా రూపొందిస్తున్న ‘జాతీయ పనిమనుషుల విధానాన్ని’ త్వరలోనే కేబినెట్ ముందుకు సంబంధిత శాఖ అధికారులు తీసుకురానున్నారు.

వయసు పెరిగేకొద్దీ బలహీనంగా మారే పనిమనుషులను యజమానులు పని నుంచి తొలగిస్తారు... దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యజమాని వారికి కచ్చితంగా తోడ్పాటునిచ్చేలా కొత్త విధానం అండగా ఉంటుంది. యజమానులు, పనిమనుషులు సంఘాలను ఏర్పరచుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. కార్మిక సంక్షేమ విభాగం డెరైక్టర్ ముసాయిదాను రూపొం దించి కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయకు సమర్పించారు. పనిమనుషులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడడం ముఖ్యమని ప్రభుత్వం తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : social seurity  working humans  9 thousand pay  minimum wage  cabinet  

Other Articles