guntur uvurupalem witnessed fish rain

Fish rain at uvuruvari palem in guntur

Khammam, fish rain, uvurupallem, guntur, fish rain in guntur, guntur district uvurupalem village, uvurupalem village witnessed fish rain, fish fallen with rain

Its a miracle again, after, guntur district uvurupalem village witnessed fish fallen with rain

మొన్న ఖమ్మం.. ఇవాళ గుంటూరు.. చేపల వర్షం..

Posted: 08/16/2015 04:15 PM IST
Fish rain at uvuruvari palem in guntur

మొన్న ఖమ్మం జిల్లాలో ఖమ్మం చిరు వ్యాపారి కళ్ల ముందు చేప, తాబేలు వర్షం పడుతున్న సమయంలో ఆకాశం నుంచి పడ్డాయి. తాబేలు వెళ్లిపోగా అతను చేపను మాత్రం దైవ ప్రసాదంగా ఇంట్లో అపూరూపంగా పెంచుకుంటున్నారు. అదెలా జరిగిందని ఆశ్చర్యం వీడిపోకముందే ఇవాళ మరో అలాంటి ఘటనే జరిగింది. గుంటూరు జిల్లా నగరం మండలం ఉయ్యూరువారి పాలెంలో చేపల వాన కురిసినట్టు ప్రచారం జరగడంతో గ్రామస్థులు పొలాలకు పరుగులు పెట్టారు. తమకు దొరికిన చేపలు తెచ్చుకున్నారు. ఈ ఉదయం పొలాలకు వెళ్లిన వారు చేపలు చూసి ఆశ్చర్యానికి లోనయారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి చేపలు పడ్డట్టు స్థానికులు చెబుతున్నారు.

కేవలం రెండు ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే చేపలు కనబడడం అనుమానాలకు తావిస్తోంది. ఇక్కడికి 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా చేపల చెరువులు లేవు. ఇక పొలాలకు నీరు అందించే కాల్వలు అడుగంటి ఉన్నాయి. దీంతో చేపలవాన కురిసిందని స్థానికులు గట్టిగా చెబుతున్నారు. ఇంతకు ముందు గతంలోనూ కృష్ణా జిల్లాలోనూ చేపల వర్షం కురిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే మన దేశంలో చేపలు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fish rain  uvurupallem  guntur  khammam  

Other Articles