Rain mitigates drought in Telangana, Andhra Pradesh

Several areas inundated as heavy rain continues in hyderabad

Andhra Pradesh, Telangana, Rain, drought, Hyderabad, Rain mitigates drought, Showers Bring Solace And Hope in Telugu States, rain in hyderabad, havoc for traffic, west godavari, konda vaagu, 3 dead

Heavy rains in the last two days in several parts of Telangana and Andhra Pradesh has wiped out the drought to a considerable extent, bringing cheers to farmers and life to a number of streams and rivulets.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, కొండవాగులో చిక్కకున్న 3 మృతి, మరో 3 గల్లంతు

Posted: 08/16/2015 02:58 PM IST
Several areas inundated as heavy rain continues in hyderabad

అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతుండంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు కోస్తా, సీమాంధ్రలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు సాగుకు మంచి అవకాశమని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
 
ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాజేడు మండలం గుమ్మడిదొడ్డి వద్ద చీకుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షం దాటికి గ్రామాలు జలమయమ్యాయి. దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు స్థంభించిపోగా, పలు పల్లెలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాచలంలో గోదావరి నది నీటిమట్టం 35 అడుగులకు చేరుకుంది. రాజమండ్రి పట్టణంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైటెక్ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.

అటు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం అలుముకుంది. బుట్టాయిగూడెం మండలం కొండవాగులో వరద నీటు ఉధ్దృతి అధికమవ్వడంతో ఆరుగురు కొట్టుకుపోయారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో స్థానికంగా విషాధఛాయలు అలుముకున్నాయి. గల్లంతు అయినవారిలో ముగ్గురు మృతదేహాలు లభించాయి. మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. జిల్లాలో బుట్టాయిగూడెం మండలంలో గుబ్బలమంగమ్మ ఆలయం ఉంది. భక్తులు ప్రతి గురువారం, ఆదివారం ఈ గుడికి వస్తుంటారు. ఆదివారం ఉదయం కృష్ణాజిల్లా గుడివాడ మండలం అన్నవరప్పాడుకు చెందిన ఒక కుటుంబం ఈ గుడికి వచ్చారు. ఈ గుడి సమీపంలో కొండవాగు ఉంది. ఆ కొండవాగు దాటుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు సరస్వతి, కళ్యాణి, రమేష్‌లుగా గుర్తించారు. మరో ముగ్గురు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana  Rain  drought  Hyderabad  west godavari  

Other Articles