Chief Secretary Rajiv Sharma Shocks Kcr Govt In Outsourcing Salary Issue | Telangana Govt

Chief secretary rajiv sharma shocks kcr govt outsourcing salary issue

kcr govt, kcr news, rajiv sharma, chief secretary rajiv sharma news, kcr latest news, kcr controversy, kcr updates, kcr shocks, rajiv sharma shocks kcr, kcr govt controvesy, rajiv shocks kcr, outsourcing salaries, outsourcing salary issue

Chief Secretary Rajiv Sharma Shocks Kcr Govt Outsourcing Salary Issue : The Telangana State Chief Secretary Rajiv Sharma Given Shocks To Kcr Govt In Outsourcing Salary Issue

కేసీఆర్ సర్కారుకు షాకిచ్చిన రాజీవ్ శర్మ

Posted: 08/14/2015 11:33 AM IST
Chief secretary rajiv sharma shocks kcr govt outsourcing salary issue

ఇక్కడ మేటర్ లోకి వెళ్లడానికంటే ముందు రాజీవ్ శర్మ అంటే ఎవరో తెలుసుకోవాల్సి వుంది. ఈయన మరెవ్వరో కాదు.. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శిగా సీఎం కేసీఆర్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి. నిజానికి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈయనను ఏపీకి కేటాయించారు. కానీ.. తన ప్రభుత్వానికే ఆయన్ను నియమించుకోవాలన్న పట్టుదలతో కేసీఆర్ అటు కేంద్రంతో, ఇటు ఏపీ సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిపి మరీ తనవద్దకు తెచ్చుకున్నారు. ఆ విధంగా తనవద్దకు తెచ్చుకున్న రాజీవ్ శర్మే ఇప్పుడు ఆయనకు కాస్త చుక్కలు చూపిస్తున్నాడని సమాచారం. ‘ఏ విషయంలో అనుకుంటున్నారా..?’ ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న రాజీవ్ శర్మకు ఓ విషయంలో సీఎం కేసీఆర్ కంటే ఎక్కువ అధికారం వుంటుంది. అంటే.. కేసీఆర్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా.. దానిపై రాజీవ్ సంతకం చేస్తేనే అది అమల్లోకి వస్తుంది.. లేకపోతే రాదు. ఈ అధికారంతోనే ఆయన కేసీఆర్ సర్కారుకు తాజాగా షాకిచ్చారని సమాచారం. ఇటీవలే సీఎం కేసీఆర్ ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే! అయితే.. రాజీవ్ ఆ నిర్ణయంపై సంతకం చేస్తేనే అది అమల్లోకి వస్తుంది. కానీ.. ఇంతవరకు ఆయన ఆ విషయంపై సంతకం చేయకపోవడంపై వేతనాల పెంపు అమలు వ్యవహారం ప్రశ్నార్థకంగా మారింది. ‘అయినా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచాల్సిన అవసరం ఏముంది’ అని ప్రభుత్వానికి రాజీవ్ గట్టిగానే ఎదురుతిరిగినట్లు సమాచారం. అంతేకాదు.. సదరు ఫైలును పునరాలోచించాలని చెబుతూ దానిని ఈయన తిప్పి పంపించారు.

ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన వ్యవహారాలపై ఏజెన్సీలతో మాట్లాడుకుంటామని రాజీవ్ శర్మ వాదిస్తున్నారు. అలాగే వారి వేతనాల విషయం ఆయా ఏజెన్సీలే చూసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అససరం కూడా లేదని రాజీవ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి.. రాజీవ్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తారో..? అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అటు.. తాను తీసుకున్న నిర్ణయంపై రాజీవ్ ఒప్పుకోకపోవడంపై కేసీఆర్ కాస్త నిరాశగానూ వున్నట్లు వార్తలొస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kcr  rajiv sharma  outsourcing salaries  

Other Articles