Chandrababu naidu | AP | Social Media

Ap cm chandrababu naidu useing social media for his govt programs

Chandrababu naidu, AP, Social Media, twitter, facebook, AP CMO

Ap CM Chandrababu naidu useing social media for his govt programs. AP cm Chandrababu well known as hitech babu for his future vision on technology.

హైటెక్ బాబు.. సోషల్ మీడియా ద్వారా భలే ప్రచారం

Posted: 08/13/2015 08:51 AM IST
Ap cm chandrababu naidu useing social media for his govt programs

హైటెక్ సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్‌ మీడియాను మీడియాను పెద్ద ఎత్తున వాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రజల స్పంద‌న‌ను తెలుసుకుంటున్నారు. అంతేకాదు ఫేస్ బుక్ లో సీఎంఓ పేజీకి భారీగా లైక్ లు కూడా వ‌స్తున్నాయి. వివిధ సమస్యలపై మీడియాలో ఏమైనా పోస్టులు వస్తుంటే.. సీఎం కార్యాలయ సిబ్బంది వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. టెక్నాల‌జీని ప్రమోట్‌ చేయ‌డంలోనే కాదు.... వినియోగించటంలోనూ ముందంజ‌లో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇ-ఆఫీస్, ఇ-కేబినెట్..ఇలా అన్ని వ్యవస్థలను ఆన్‌లైన్‌ చేస్తున్న సీఎం చంద్రబాబు... ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం కూడా టెక్నాలజీని అదేవిధంగా వాడుకుంటున్నారు.  ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో సీఎం చంద్రబాబు కార్యక్రమాలకు ఓ ప్రత్యేక పేజీని క్రియేట్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంఓ పేరుతో ఉన్న ఈ పేజీకి భారీ స్పంద‌న వ‌స్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను, చంద్రబాబు సందేశాలను ఈ పేజీద్వారా మినిట్‌ టు మినిట్‌ అపడేట్ చేస్తున్నారు.

ఇక.. ఫేస్‌బుక్‌లో ప్రభుత్వ అపడేట్స్‌కు సంబంధించి ప్రతిరోజు ఉదయం సీఎం చంద్రబాబు ప‌లు సూచ‌న‌లు చేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌  సీఎం కార్యాల‌యంలో ప‌నిచేస్తోంది. ఫేస్ బుక్ పేజీలో వ‌చ్చే కామెంట్స్, సమస్యలను వెంట‌నే సీఎం దృష్టికి తీసుకెళ్ళటం ...వాటిపై చ‌ర్చించి ప‌రిష్కారం చూపించే బాధ్యతను కూడా ఈ టీమ్‌ తీసుకుంటోంది. ఇక.. ప్రభుత్వం తరపున చేస్తున్న ఒక్కో పోస్ట్‌కు వేల సంఖ్యలో  లైక్‌లు వ‌స్తున్నాయి. సీఎం ఫేస్ బుక్ పేజీని రెగ్యుల‌ర్ గా 36 వేల‌ మంది ఫాలో అవుతున్నార‌ని చెబుతున్నారు. మ‌న‌దేశంతో పాటు ఇత‌ర దేశాల వారు కూడా సీఎం ఫేస్ బుక్ పేజీని ఫాలో అవుతున్నార‌ని వారు వివరించారు. ఫేస్ బుక్ లోనే కాదు ట్విట్టర్ లో సైతం ఏపీ సీఎంఓ దేశంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు ప్రభుత్వ వ‌ర్గాలు తెలిపాయి. సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల సూచనలు, సలహాలు అందుతుండడం సంతోషంగా ఉందని అధికారులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  AP  Social Media  twitter  facebook  AP CMO  

Other Articles